స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన సంచలన చిత్రం ‘పుష్ప’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ గత ఏడాది విడుదలై పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ముత్యంశెట్టి మీడియా సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసింది. బాలీవుడ్ లోనూ ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే.
ఎలాంటి ప్రయోషన్స్ లేకుండానే కేవలం మౌత్ టాక్ తో ఈ మూవీ హిందీ వెర్షన్ వంద కోట్లకు మించి రాబట్టడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా సాంగ్స్ బన్నీ మేనరిజమ్ పుష్ప డైలాగ్ కూడా ఓ రేంజ్ లో వైరల్ కావడంతో సినిమా మరింత మందికి చేరువైంది.
ఇదిలా వుంటే ఫస్ట్ పార్ట్ కి లభించిన క్రేజ్ తో పాటు రీసెంట్ గా విడుదలైన ‘కేజీఎఫ్ 2’ కు లభించిన స్పందనని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2ని మరింత స్పెషల్ గా తీర్చి దిద్దాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారట.
ఇందు కోసం స్క్రీప్ట్ లో భారీ మార్పులు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ మార్పులకు తగ్గట్టే బడ్జెట్ ని రూ. 375 కోట్లకు పెంచేశారట. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో మిస్ కావడంతో సెకండ్ పార్ట్ కోసం ఆయనని సుకుమార్ రంగంలోకి దించుతున్నారని చెబుతున్నాను. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఆగస్టులో సెట్స్ పైకి రానుందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ లో జోరుగా జరుగుతోంది. ఫైనల్ వర్క్ ని ఫినిష్ చేసి స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో దర్శకుడు సుకుమార్ తన టీమ్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని మించి సెకండ్ పార్ట్ ని తెరపైకి తీసుకురావాలని దీనికి సంబంధించిన చర్చలు చేస్తున్నారు.
అయితే ఈ చర్చల్లో దర్శకుడు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కూడా పాల్గొంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు సాన దర్శకుడు సుకుమార్ వద్ద శిష్యుడిగా వర్క్ చేశాడు. ఆయన అందించిన సపోర్ట్ వల్లే తనే ‘ఉప్పెన’తో దర్శకుడిగా మారి తొలి చిత్రంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. తను ప్రస్తుతం ‘పుష్ప 2’ స్క్రిప్ట్ డిష్కర్శన్స్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ లో జీనియస్ అయిన సుకుమార్ కు తను కూడా కొన్ని ఇన్ పుట్స్ ఇస్తున్నాడట. ఇది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.