ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ ఈ సినిమాని అప్పుడు, ఇప్పుడు అంటూ షూటింగ్ పొడిగిస్తూనే ఉన్నారు. మూడేళ్లు అవుతున్న ఇంకా ఫైనల్ స్టేజ్ కి రాలేదు. ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్ కి సంబందించిన సన్నివేశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయంట. ఇవన్నీ అయ్యాక మరల పుష్పరాజ్ క్యారెక్టర్ పై 15 రోజుల షూటింగ్ ఉండబోతోందంట. ఈ షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనేది చిత్ర యూనిట్ కి కూడా క్లారిటీ లేదు.
సుకుమార్ ఓ వైపు ఎడిటింగ్ వర్క్ చేయిస్తూనే మరో వైపు షూటింగ్ కూడా కొనసాగిస్తున్నారు. పుష్ప సినిమాలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లుని కూడా సరిచేసుకొని ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో పుష్ప ది రూల్ చిత్రాన్ని అందించాలని అనుకుంటున్నారు. అందుకే షూటింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 2022 ఆఖరులో రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు. అయితే షూటింగ్ ఫినిష్ కాకపోవడంతో 2023 ఆగష్టు 15న రిలీజ్ ఎనౌన్స్ చేశారు.
అది కూడా క్యాన్సిల్ అయ్యి డిసెంబర్ 6 అంటూ మరో రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ తేదీకైనా మూవీ వస్తుందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఆగష్టు 15 పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ చేసి ఉంటే ఇండిపెండెన్స్ డే తో పాటు ఫెస్టివల్స్, వీకెండ్స్ అన్ని హాలిడేస్ తో కనీసం 5 రోజులు కలిసొచ్చేది. అలాగే కృష్ణాష్టమి హాలిడే సెకండ్ వీకెండ్ కూడా కలిసొచ్చే ఛాన్స్ ఉండేది.
పుష్ప ది రూల్ మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కి ఆగష్టు 15న రిలీజ్ చేసి ఉంటే వారం, పది రోజుల్లోనే 400-500 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకొని ఉండేదనే మాట వినిపిస్తోంది. అలాగే వీకెండ్ నాలుగు రోజులు కూడా భారీ కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉండేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇలాంటి డేట్ మళ్ళీ పుష్ప ది రూల్ కి దొరక్కపోవచ్చనే మాట వినిపిస్తోంది.
పుష్ప ది రూల్ డిసెంబర్ 6కి వాయిదా పడటంతో ఆగష్టు 15కి రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకి వీకెండ్ బాగా కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అలాగే హిందీలో స్త్రీ2, ఖేల్ ఖేల్ మెయిన్, వేద సినిమాలు ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలు లాంగ్ వీకెండ్ ని ఉపయోగించుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.