అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ గత రెండేళ్లుగా సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.
పుష్ప 2 సినిమా విడుదల విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా షూటింగ్ చాలా పెండింగ్ ఉంది. అంతే కాకుండా ఐటెం సాంగ్ విషయంలో స్పష్టత రాలేదు. ఏ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించాలి అనే విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఇలాంటి సమయంలో పుష్ప 2 ను ఆగస్టు 15న విడుదల చేయడం సాధ్యమేనా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కారణంగా వాయిదా పడబోతున్న కల్కి సినిమా ను ఆగస్టు లో విడుదల చేసే విధంగా వైజయంతి మూవీస్ వారు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ కల్కి సినిమా కనుక ఆగస్టు లో విడుదల అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ విషయంలో మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప టీం మెంబర్స్ విడుదల విషయంలో అనధికారికంగా మీడియాకు లీక్ ఇచ్చారు.
ఆగస్టు లో ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 విడుదల అవ్వడం ఖాయం. ప్రభాస్ కల్కి సినిమా తో వచ్చినా కూడా పుష్ప 2 పాన్ ఇండియా రేంజ్ లో ముందుగా అనుకున్న తేదీకి అంటే ఆగస్టు 15న విడుదల చేసి తీరుతాం అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు చెబుతున్నారట.
రెండు మూడు రోజుల్లో కల్కి సినిమా కొత్త విడుదల తేదీ విషయంలో స్పష్టత వస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో పుష్ప టీం నుంచి రిలీజ్ విషయమై మరింత స్పష్టమైన రావడంతో కల్కి సినిమా నిర్మాతలు ఆ దిశగా తమ రిలీజ్ డేట్ ను ప్లాన్ చేసుకుంటారేమో చూడాలి.