పుష్ప 2 మెంటల్ ఎక్కించడంలో సుకుమార్ లెక్క అదేనా..!

ఈ ఇయర్ రాబోతున్న మచ్ అవైటెడ్ మూవీ పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి మరో అద్భుతాన్ని సృష్టించాలని చూస్తున్నారు. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 ను అంతకుమించి ఉండేలా చేస్తున్నాడు సుకుమార్. పుష్ప 2 సినిమా విషయంలో సుక్కు లెక్కలన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయని టాక్. సౌత్ ఆడియన్స్ ని మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని పుష్ప 2 చేస్తున్నారు.

సినిమాలో ప్రతి సీన్.. పుష్ప రాజ్ ప్రతి మూమెంట్ ఆడియన్స్ కు మెంటల్ ఎక్కించేలా ఐకానిక్ గా ప్లాన్ చేశారట సుకుమార్. తప్పకుండా ఈ సీన్స్ అన్నీ రిలీజ్ తర్వాత ట్రెండింగ్ లో ఉంటాయని అంటున్నారు. సుకుమార్ పుష్ప 2 సినిమాలో కొన్ని హైలెట్ సీన్స్ సినిమాపై నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడేలా చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి జాతర సీన్ సినిమాపై ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

పుష్ప 2 లో అల్లు అర్జున్ ఎంట్రీ.. మేనరిజం.. యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ అందిస్తాయని చెబుతున్నారు. పుష్ప 2 పై ఉన్న ఈ బజ్ కి అంచనాలను అందుకుంటే మాత్రం సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ వసూళ్లను తీసుకు రావడం పక్కా అని అంటున్నారు. వీటితో పాటు దేవి శ్రీ ప్రసాద్ కూడా తన వంతుగా సినిమాను మ్యూజిక్ విషయంలో టాప్ లో ఉండేలా చూస్తున్నాడు.

పుష్ప 2 ప్రతి అంశంలో ది బెస్ట్ గా ఉండేలా సుకుమార్ కాలిక్యులేట్ చేస్తున్నాడట. సినిమాను తప్పకుండా ఫ్యాన్స్ అంతా కూడా ఖుషి చేసేలా చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ అందిస్తున్నాయి. సో తప్పకుండా ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు ఊర మాస్ ట్రీట్ అందించడం పక్కా అనిపించేలా ఉంది. మరి పుష్ప 2 ఎన్ని సంచలనాలు సృష్టిస్తాయన్నది చూడాలి.

అంచనాలు లేకుండా వచ్చి పుష్ప 1 బ్లాక్ బస్టర్ అందుకోగా భారీ అంచనాలతో వస్తున్న పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న పుష్ప 2 కోసం నేషనల్ లెవెల్ లో ఉన్న ఆడియన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.