పుష్ప 2: RGV మెగా రివ్యూ.. ఏమన్నారంటే.. h

ఐకాన్ స్టార్ అల్లు ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షోలకి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ప్రస్తుతం ట్విట్టర్ లో ‘పుష్ప 2’ నామజపం నడుస్తోంది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో యాక్షన్ సన్నివేశాలు. జాతరలో అమ్మవారి గెటప్ లో బన్నీ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉన్నాయని అంటున్నారు. కొన్ని థియేటర్స్ లో ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సినిమా అసలైన రిజల్ట్ ఏంటనేది ఈ రోజు పడే షోలతో ఆల్ మోస్ట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఓ వైపు ట్విట్టర్ లో పబ్లిక్ టాక్, మరో వైపు రివ్యూయర్స్ సోషల్ మీడియాలో తన ఒపీనియన్స్ ని షేర్ చేసుకున్నారు. చాలా రివ్యూలలో సినిమాలోని అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా నిడివి కొద్దిగా ఎక్కువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘పుష్ప 2’ పైన ట్విట్టర్ లో రివ్యూ షేర్ చేసుకున్నారు. ‘పుష్ప 2’ తో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన టీమ్ కి అభినందనలు తెలియజేశాడు. అల్లు అర్జున్ ఇప్పుడు మెగా మెగా మెగా మెగా అంటూ ఆర్జీవీ తన ట్వీట్ లో రాశారు. ఈ మూవీ రిలీజ్ కి రెండు రోజుల ముందు నుంచి ఆర్జీవీ ట్విట్టర్ లో మెగా ఫ్యాన్స్ ని, మెగా హీరోలని ప్రోవోక్ చేసే విధంగా ట్వీట్ లు చేస్తున్నారు.

వీటికి కొనసాగింపుగా ఇప్పుడు ‘పుష్ప 2’ మూవీ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అని తన అభిప్రాయాన్ని చెప్పడమే కాకుండా అల్లు మెగా హీరో అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం వెనుక వేరే ఉద్దేశ్యం ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై మెజారిటీగా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మేకర్స్ ఏ టార్గెట్ తో ప్రీమియర్స్ వేసారో ఆ పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకి బలంగా వస్తోంది.

అది ఈ రోజు కలెక్షన్స్ లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 200+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సునాయాసంగా అందుకుంటుందని అనుకుంటున్నారు. టికెట్ ధరలు కూడా పెంచిన నేపథ్యంలో ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.