పూజాహెగ్డే శివరాత్రి ఉపవాసం ఇంట్రెస్టింగ్!

నేడు దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడు తున్నాయి. దేశ వ్యాప్తంగా హరనామ స్మరణ మార్మోగుతోంది. ముక్కంటి ఆలయాలు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు శివనామ స్మరణలో మునిగిపోయారు. మరి ఇలాంటి సెలబ్రేషన్స్ లో బుట్టబొమ్మ పూజాహెగ్డే కూడా పాల్గొంటుందా? అంటే అవుననే అంటోంది.

అవును పూజా బ్యూటీ కూడా గొప్ప శివ భక్తురాలుట. శివారాత్రి వచ్చిందంటే ఆరోజంతా మంచి నీళ్లు కూడా ముట్టకుండా 24 గంటలు పాటు అలాగే ఉండిపోతుందిట. చిన్ననాటి నుంచి ఉన్న అలవాటు ఇది అంటోంది. `ప్రతి శివరాత్రికి నాన్న ఉపవాసం ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తున్నాను కాబట్టి నేను ఫాలో అయ్యాను. భరతనాట్యం నేర్చుకున్నాను కాబట్టి అలా నటరాజుని కొలిచేదాన్ని.

ఆ విధంగా శివుడితో నా అనుబంధం ఎప్పటినుంచో ఉంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా దీన్ని పాటిస్తున్నాను. జిగేలు రాణి పాటు షూట్ అప్పుడు శివరాత్రి వచ్చింది. దీంతో ఉపవాసం తోనే షూట్ లో పాల్గొన్నాను. రోజంతా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బందిగా అనిపించినా..ఆ శివ నామ స్మరణతో షూటింగ్ దిగ్విజయంగా పూర్తి చేసాను’ అంది.

అయితే ఈ ఏడాది ఆ రకమైన ఇబ్బంది లేనట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ‘కీసీకా భాయ్..కీసీకా జాన్’ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఆమె పార్ట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. తెలుగులో ఎస్ ఎస్ ఎంబీ 28లో మహేష్ కి జోడీగా నటిస్తోంది. ఇప్పటికే కొద్ది భాగం షూట్ పూర్తి చేసిన టీమ్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉంది.

ఆ రకంగా ఈ ఏడాది పాస్టింగ్ షూటింగ్ నుంచి తప్పించుకోగల్గింది. లేదంటే మరోసారి ఉపవాసంతోనే షూట్ లో పాల్గొనాల్సి వచ్చేది. ఇక బ్యూటీకి గతేడాది అన్ని వైఫల్యాలే ఎదురయ్యాయి.

భారీ సినిమాలన్ని వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన సంగతి తెలిసిందే. దీంతో సక్సెస్ కోసం కసిగా ఎదురు చూస్తోంది. చేతిలో ఉన్న సినిమాలతో విజయం అందుకుని రేసులోకి రావాలని చూస్తుంది.