ఎట్టకేలకు మంచు మనోజ్ తాను పెళ్లి చేసుకోబోతున్న భూమా మౌనిక గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి మంచు మనోజ్ బ్రేకులు వేస్తూ తాను పెళ్లి చేసుకోబోయేది. భూమా మౌనిక రెడ్డిని అని క్లారిటీ ఇచ్చినట్లు అయింది. ఇక ఈరోజు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు జరగబోతున్న వీరు వివాహం మంచు లక్ష్మీ నివాసంలో చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒకప్పుడు మంచు మోహన్ బాబు కూడా మొహం అంతా ఫిలింనగర్ లో నివాసం ఉండేవారు. కానీ మంచు మోహన్ బాబు కుటుంబం ఒక శంషాబాద్ వైపు కట్టుకున్న కొత్త నివాసానికి వెళ్లిపోవడంతో ఫిలింనగర్ నివాసంలో మంచు లక్ష్మి ఒక్కరే ఉంటున్నారు. ఇప్పుడు అదే ఇంట్లో మంచు మనోజ్ వివాహం ఘనంగా చేస్తున్నారు. వివాహ మహోత్సవం ఖరారు అయిందని తెలుస్తోంది.
ఇప్పటికే మనోజ్ కి సన్నిహితులు తెలుగు సినీ పరిశ్రమలో మెలుగుతున్న వారంతా వివాహ వేడుకకు హాజరవుతున్నారు. ఇక కొద్దిసేపటికి మంచు లక్ష్మి తన సోషల్ మీడియా వేదికగా మనసు మనోజ్ బుగ్గ మీద దిష్టి చుక్క పెడుతూ ఉన్న ఒక ఫోటో మీడియాలో షేర్ చేసింది. దానికి పెళ్లి కొడుకు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. భూమా మౌనిక వెడ్స్ మంచు మనోజ్ అంటూ ఆమె సోషల్ మీడియాలో ఈ ఫోటోని షేర్ చేసింది. గతంలో మంచు విష్ణు వివాహంలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడిన మనసు మనోజ్ ఆమెతో ప్రేమలో పడి తర్వాత పెద్దలను ఒప్పించు వివాహం చేసుకున్నారు.
అయితే వీరి వివాహం మున్నాళ్ల ముచ్చటగా మారింది. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి ఈ జంట విడిపోయారు. భూమా మౌనిక రెడ్డి కూడా మరోపక్క బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. కాని వారి దాంపత్య జీవితం కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదు. భూమా మంచు కుటుంబాల మధ్య స్నేహం కారణంగా మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి మధ్య ప్రేమ ఏర్పడి అది ఇప్పుడు వివాహానికి దారితీసింది.