ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్నది పెద్దల మాట. చద్దన్నం మూట లాంటింది. ఇవన్నీపాత మాటలే అయినా వాస్తవాలు. కొంత అనుభవం వచ్చిన తర్వాత పెద్దల మాటలు గుర్తొస్తాయి. నాన్న ప్రేమ గురించి త్రివిక్రమ్ నాన్న స్పీచ్ లు ఎలా కొంత మందికి నిద్ర లేపుతాయో..పెద్ద మాటలు మరికొంత మందిని కొన్నాళ్లకి తప్పక మొద్దు నిద్రని లేపుతాయి.
కాకపోతే కాస్త సమయం పడుతుంది అంతే. తాజాగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి ప్రస్తావిస్తే…ఈ హీరోలు 2023లోనైనా పెళ్లి భాజాలు మోగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వాళ్లందరికీ ఇప్పటికే 30 క్రాస్ 35 పడిలో పడిన వాళ్లు కొంతమందైతే 40..45కి చేరువైన ఘనా పాటులు కొందరున్నారు. వీళ్లంతా ఇంకా స్టిల్ బ్యాచిలర్ లైఫ్ ని ఆస్వాదించడానికే ఇష్టపడుతున్నారు. వాళ్లపై ఓ లుక్ ఏస్తే..
ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పాలి. ఈయన వయసు 43 దాటినా బ్యాచిలర్ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్నాడు. పెళ్లి విషయంలో మీడియాలో కథనాలు తప్ప! ఇంత వరకూ పిల్ల ఎవరన్నది? క్లారిటీ లేదు. హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నాడని వస్తోన్న వార్తల్లోనూ క్లారిటీ లేదు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిది ఇదే వరుస. ఈయన వయసు 34 దాటినా సింగిల్గానే కనిపిస్తున్నాడు. పెళ్లి గరించి ఎప్పుడు ప్రశ్నించినా ఓ నవ్వు నవ్వేసి ఎస్కేప్ అవుతుంటాడు. కెరీర్ మీద ఉన్న శ్రద్ద పెళ్లి మీద చూపలేదన్నది కొంత మంది వాదన. మరో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఇదే వరుసలో కనిపిస్తున్నాడు. ఎంత సేపు సినిమాలు తప్ప హీరోకి పెళ్లి ధ్యాస ఉండదు. ఎఫైర్లు..డేటింగ్ వ్యవహారాల్లోనూ పెద్దగా హైలైట్ కాలేదు.
అలాగే మెగా మేనల్లుడు సాయితేజ్ కూడా స్టిల్ బ్యాచిలర్. వయసు 36 దాటుతుంది. అయినా నో మ్యారేజ్ అనేస్తున్నాడు. ఇతని కెరీర్ లో భారీ యాక్సిడెంట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి తేరుకుని సినిమాలు చేస్తున్నాడు. మరి పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి. అలాగే మెగా హీరోల్లో వరుణ్ తేజ్….అల్లు శిరీష్ కనిపిస్తున్నారు. ఇద్దరికి పెళ్లికి ఎలాంటి అడ్డంకిలేదు. లైన్లు అన్ని క్లియర్ గా ఉన్నాయి. కానీ ఇంకా మనసు పెళ్లివైపు మళ్లలేదు. వరుణ్ సీరియస్ గా సినిమాలు చేస్తుంటే..శిరీష్ అంతే సీరియస్ అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు.
అలాగే ఇదే అంశంపై టాలీవుడ్ లో ప్రధానంగా మాట్లాడాల్సిన హీరో తరుణ్. వయసు 42. బాలనటుడిగా రాణించిన ఇతను హీరోగా వరుస సక్సెస్లు అందుకున్నాడు. కానీ వారసుల ఎంట్రీతో తరుణ్ కెరీర్ ముగిసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు హీరోయిన్లతో పాత పరిచయాలు గుర్తు చేస్తుంటాడు.
ఇక శర్వానంద్ 2023 లో పెళ్లి ఖాయం అని తెలుస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయితో పెద్దల కుదిర్చిన పెళ్లి జరుగుతుందని రెండు రోజులుగా మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది పెళ్లి భాజాలు మోగించడం ఖాయంగానే కనిపిస్తుంది. అలాగే రౌడోబోయ్ విజయ్ దేవరకొండ కూడా పెళ్లి తంతు వేగంగా పూర్తి చేయాలి.
వెనుక చిన్న దేవరకొండ లైన్ లో ఉన్నాడు కాబట్టి విజయ్ కి ముందుగా కానిస్తే గానీ లైన్ క్లియర్ గా ఉండదు. మరి అలా కాకుండా నిబంధనలు అతిక్రమిస్తే చెప్పలేం. ఇంకా రాజ్ తరుణ్..సాయి శ్రీనివాస్…అకిల్..సుశాంత్..అడవిశేష్…నారా రోహిత్ సహా చాలా మంది ఉన్నారు. వీళ్లంతా కొత్త ఏడాదిలోనైనా పెళ్లి కబురు చెబుతారేమో చూడాలి.