మహేష్ బాబు.. పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రిన్స్ మహేష్ బాబు ను సూపర్ స్టార్ మహేష్ బాబు గా మార్చింది పోకిరి అంటూ అభిమానులు బలంగా నమ్ముతారు. పోకిరి సినిమా యొక్క అద్భుతమైన క్లైమాక్స్ అంతకు ముందు ఆ తర్వాత రాలేదు అనేది సూపర్ ఫ్యాన్స్ టాక్.
పోకిరి సినిమా వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా ఫ్రెష్ నెస్ ఇంకా అలాగే ఉంది అనడంలో సందేహం లేదు. కొత్తగా టీవీల్లో చూసే వారికి కూడా ఎగ్జైట్ మెంట్ ను కలిగిస్తుంది. ఈ తరం ప్రేక్షకులు సైతం వావ్ అంటూ నోరు వెళ్లబెట్టి చూసేంత ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు పోకిరిలో ఉంటాయి. అందుకే పోకిరి ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నా కూడా సందడి భారీ ఎత్తున ఉంది.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టు 9వ తారీకున తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా పోకిరి స్పెషల్ షో లు వేయబోతున్నారు. ఆ మధ్య అమెరికాలో ఒక ఏరియాలో పోకిరి సినిమా రీ రిలీజ్ అంటూ ప్రకటించి టికెట్లు ఆన్ లైన్ లో పెట్టిన కొంత సమయంకే హౌస్ ఫుల్ అయ్యింది. ఇప్పుడు ఏఎంబీ లో కూడా అదే పరిస్థితి.
ఆగస్టు 9వ తారీకు సాయంత్రం 7 గంటల ప్రత్యేక షో కోసం పోకిరి సిద్ధం అయ్యాడు. సినిమా కు సంబంధించిన బుకింగ్ ప్రారంభించిన కేవలం రెండు నిమిషాల్లోనే హౌస్ ఫుల్ అయ్యింది. మొత్తం టికెట్లు కేవలం రెండు నిమిషాల్లోనే అమ్ముడు పోయినట్లుగా ఏఎంబీ నిర్వాహకులు చెబుతున్నారు.
మహేష్ బాబు సొంత థియేటర్ లో మహేష్ బాబు పోకిరి సినిమా ను చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహంతో ఉన్నారని దీన్ని బట్టి అర్థం అవుతోంది. పోకిరి సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇలియానా నటించగా విలన్ గా ప్రకాష్ రాజ్ నటించాడు. నాజర్ ఈ సినిమాలో మహేష్ బాబుకు తండ్రి పాత్రలో కనిపించాడు.