పోకిరి విలన్ రెండో పెళ్లి… మొదటి భార్య సోషల్ మీడియా పోస్ట్ వైరల్

తెలుగు లో పోకిరి తో పాటు ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన ఆశిష్ విద్యార్థి ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆరు పదుల వయసులో రెండవ పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆశిష్ విద్యార్థి నిజ జీవితంలో కూడా పోకిరి సినిమాలో మాదిరిగానేనా అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఆశిష్ విద్యార్థి తన మొదటి భార్య రాజోషి కి విడాకులు ఇచ్చి ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూర్ అయిన రూపాలి బారువాను రెండో పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఆశిష్ మరియు రూపాలి యొక్క పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు తెగ సర్క్యూలేట్ అవుతున్న సమయంలో ఆశిష్ మొదటి భార్య సోషల్ మీడియా పోస్ట్ లు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రాజోషి సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు చేసింది. ఆమె ఒక చిరునవ్వుతో ఉన్న సెల్ఫీని షేర్ చేసింది. దాంతో పాటు జీవితం అనే పజిల్ లో గందరగోళానికి లోనవద్దు అంది. అంతే కాకుండా నిన్ను బాధ పెట్టే పనుల జోలికి అస్సలు వెళ్లవద్దు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే ఎప్పుడు బాగుంటుందని పేర్కొంది.

ఇంకా.. అతిగా ఆలోచిస్తూ అనవసర సందేహాలు పెట్టుకున్నావేమో కానీ ఇక మీదట అలాంటివి ఉండక పోవచ్చు. ప్రస్తుతానికి ఆ గందరగోళం కు క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె చేసిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. మరో వైపు ఆశిష్ విద్యార్థి యొక్క పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.