ప్రభాస్ ను అధిర చేరబోతున్నది అప్పుడేనా?

ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే. ప్రభాస్ ను గతంలో ఎప్పుడు చూపించని విధంగా మారుతి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా అభిమానులు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.

మొదట ఈ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ ఈమధ్య కాలంలో సినిమా గురించి వస్తున్న వార్తలు మరియు పుకార్లు అభిమానుల్లో అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించబోతున్నాడు.

ఇప్పటివరకు ప్రభాస్ మరియు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు మారుతి జూన్ నుండి సంజయ్ దత్ ను రంగంలోకి దించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

నెల రోజుల పాటు ఏకధాటిగా జరిగే సింగిల్ షెడ్యూల్ లో సంజయ్ దత్ సన్నివేశాలను దర్శకుడు మారుతి ముగించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్ యొక్క తాత పాత్రలో సంజయ్ దత్ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఈ సినిమాలో సంజయ్ దత్ నటించడం వల్ల పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ దక్కే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాను ఇదే ఏడాదిలో ముగించి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. పీపుల్స్ మీడియా బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది.