ప్రభాస్ లేటెస్ట్ దర్శనం.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఫ్యాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ గా గుర్తింపు అందుకుంటున్న ప్రభాస్ బాహుబలి తర్వాత సరైన సక్సెస్ చూడకపోయినప్పటికీ రేంజ్ అయితే అసలు తగ్గడం లేదు. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ యాక్షన్ సినిమాతో వస్తున్నాడు అంటే కలెక్షన్స్ ఈజీగా 100 కోట్లు మొదటి రోజే వచ్చేస్తాయి అని చెప్పవచ్చు. PlayUnmute /

ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమా కోసమే అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన రాబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం కల్కి తో పాటు మరో సినిమా కూడా ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి ప్రాజెక్టు పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే సలార్ రీసెంట్ ట్రైలర్ లో తప్పితే ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఎలా ఉంది అనేది నిన్నటి వరకు ఎవరికీ తెలియదు.

ఇక మొత్తానికి ఇప్పుడు ప్రభాస్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నెట్ ఫ్లిక్స్ సీఈవో ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులఅందరిని కూడా కలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ ను కూడా కల్కి తో కలుసుకున్నాడు. అందులో ప్రభాస్ లుక్ చాలా మాసీగా ఉంది. నిండా గెడ్డంతో కోరమీసాలు స్టైల్ తో ప్రభాస్ గాగుల్స్ పెట్టుకుని చాలా హైలెట్గా కనిపిస్తూ ఉన్నాడు.

చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను ఒక మంచి లుక్కుతో చూసాము అన్నట్లుగా ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ప్రభాస్ లుక్ పై చాలా రోజులుగా భిన్నాభిప్రాయాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు డార్లింగ్ మళ్ళీ ఎట్రాక్ట్ చేసే లుక్కుతో సిద్ధమవుతున్నట్లుగా అనిపిస్తోంది.

ఇక ఇదే లుక్కు మిగతా సినిమాలలో కూడా కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ పెరగడం ఖాయం. ఇక మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ సగం వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇకల్కి సినిమా షూట్ కూడా 70 శాతానికి పైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది దసరాకు గాని లేదంటే ఆ తర్వాత 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.