అమెరికా ప్రియుడు నిక్ జోనాస్ ని భారతదేశ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా పెళ్లాడిన సంగతి తెలిసిందే. నిక్ గాయకుడు నటుడు. పీసీ అగ్ర కథానాయికగా బాలీవుడ్ ని ఏలి ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతోంది. ఈ జంట అన్యోన్య దాంపత్యం నిరంతరం అభిమానుల్లో స్ఫూర్తి నింపుతోంది. దాదాపు పదేళ్ల వయసు వ్యత్సాసం ఉన్నా ఒకరితో ఒకరు ఒకరికోసం ఒకరు జీవిస్తున్న తీరు జంటల కు లైఫ్ గోల్స్ ని సెట్ చేస్తోంది. అయితే తాజాగా పీసీ తమ వయసు వ్యత్సాసం గురించి తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయం తెలిపింది.
2000లో లండన్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచినప్పుడు పీసీ వయసు 17. అదే సమయంలో నిక్ తన అమెరికా హోమ్ లో 7 ఏళ్ల వయస్సులో అందాల పోటీలో తన గెలుపు ను టీవీల్లో చూశాడట. తన అత్తగారు డెనిస్ జోనాస్ తనతో నాటి వాస్తవ కథను షేర్ చేసుకున్నారని నిక్ ఏడేళ్ల వయసులోనే తన విజయాలను చూశాడని తెలిపింది. జెన్నిఫర్ హడ్సన్ టాక్ షోలో మాట్లాడిన ప్రియాంక తన 17 సంవత్సరాల వయస్సులో 7ఏళ్ల యువ నిక్ తనను టీవీలో వీక్షించడం వింతగా అనిపించిందని పీసీ అంది.
మా అత్తగారు నాకు ఆ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇవేవీ నాకు తెలియవు. నాకు 17 ఏళ్లు నిండినప్పుడు నేను ప్రపంచ సుందరిగా విజేతనయ్యాను. లండన్ లో ఈవెంట్ జరిగింది. ఇది నవంబర్ – జూలై నాటికి నాకు 17 దాటాయి. మా అత్తగారు నాతో మాట్లాడుతూ… “నువ్వు 2000- మిస్ వరల్డ్ పోటీలో గెలిచినప్పుడు టీవీల్లో చూడటం నాకు గుర్తుంది! మీరు అప్పుడు లండన్ లో ఉన్నాను. నేను టెక్సాస్ లో ఉన్నాను” అని తెలిపారట.
నాకు ఆ తర్వాత తెలిసింది. నిక్ 7 సంవత్సరాల వయస్సులో ఏదో బ్రాడ్ వే షోలో ఉన్నాడు. అతని సోదరుడు 8 లేదా 9 ఏళ్ళకు బ్రాడ్ వే షోతో పాపులరయ్యాడు. అయితే అప్పటికి మా అత్తయ్యకు అందాల పోటీలు చూడటం చాలా ఇష్టం. నిక్ తో కలిసి అత్తయ్య నేను మిస్ వరల్డ్ పోటీల్లో విజేతను అయిన క్షణాన్ని టీవీల్లో చూశారని నాతో చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. 22 సంవత్సరాల క్రితం ఘటన అది.
అప్పటికి నిక్ కి 7 సంవత్సరాలు. నాకు 17 సంవత్సరాలు . ఇది చాలా విచిత్రంగా ఉంది… అని అన్నారు. మనకు ఉన్న ఈ చిన్న చిన్న జీవితంలో మనం ముందుకు తీసుకెళ్లే జ్ఞాపకాలు.. కుటుంబం చాలా ముఖ్యం. నిక్ -నేను మా జీవితాల్లో ఎన్నో విచిత్రాలను చూస్తున్నాం. మంత్రముగ్ధుల ను చేసిన చిన్న క్షణాలు మాకు ఉన్నాయి.. అని తెలిపారు.
నిక్ జోనాస్- ప్రియాంక చోప్రా జోడీ 1 డిసెంబర్ 2018న రాజస్థాన్ లో హిందూ సాంప్రదాయంలో అలాగే క్రిస్టియన్ వెడ్డింగ్ స్టైల్లో వివాహం చేసుకున్నారు. వారికి పెళ్లయి నాలుగు సంవత్సరాలు అయ్యింది. మాల్తీ మేరీ జోనాస్ అనే కుమార్తె ఉంది. మాల్తీ జనవరి 2021లో జన్మించింది. పీసీ నటించిన సిటాడెల్ సిరీస్ ఇటీవల ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ వెబ్ సిరీస్ లో రిచర్డ్ మాడెన్ సరసన నదియా సిన్ అనే గూఢచారిగా నటించింది. తదుపరి ప్రియాంక చోప్రా తన కొత్త రొమ్-కామ్ లవ్ ఎగైన్ ని కోస్టార్ సామ్ హ్యూగన్ తో కలిసి ప్రచారం చేస్తోంది. జేమ్స్ సి స్ట్రౌస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక భర్త నిక్ జోనాస్ కూడా అతిధి పాత్రలో నటించారు. త్వరలో జాన్ సెనా- ఇద్రిస్ ఎల్బాతో కలిసి తదుపరి చిత్రం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ లో ప్రియాంక చోప్రా నటించనుంది. నిక్ తన తోబుట్టువులు వారి బృందంతో కలిసి దేశంలో పర్యటిస్తున్నాడు.