ప్రియుడి వల్ల ఎనిమిదేళ్లు లాకైన హన్సిక లైఫ్?

హన్సిక మోత్వాని పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దుబాయ్ కి చెందిన బిజినెస్ పార్టనర్ అయిన తన స్నేహితుడు సోహైల్ ని హన్సిక పెళ్లాడింది. మాజీ ప్రియుడు STR సింబుతో తన సంబంధం బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ ప్రేమను కనుగొనడానికి తనకు చాలా సంవత్సరాలు పట్టిందని చెప్పింది. ఆమె రాజస్థాన్ లో గతేడాది సోహెల్ ఖతురియాను వివాహం చేసుకుంది. ఈ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ అయిన హన్సిక లవ్ షాదీ డ్రామా సీజన్ 1 .. సోహెల్ ఖతురియాతో వివాహానికి ముందు సమయంలో హన్సిక మోత్వాని ప్రయాణాన్ని డాక్యుమెంటరీ చేసింది.

తన పెళ్లికి ముందు హన్సిక తమిళ స్టార్ హీరో STR శింబుతో రిలేషన్ షిప్ లో ఉంది. వాలు (2015) సహా పలు తమిళ చిత్రాలకు ఈ జంట కలిసి పనిచేశారు. అదే క్రమంలో ప్రేమలో పడ్డారు. సహజీవనం కొనసాగించారు. తాజా ఇంటర్వ్యూలో తమ బ్రేకప్ గురించి హన్సిక ఓపెనైంది. ”ఈ బంధం నుంచి బయటపడటానికి మానసికంగా తనకు చాలా సంవత్సరాలు పట్టింది” అని చెప్పింది. ఆమె చివరికి సోహెల్ కి అవును అని చెప్పింది.

నవంబర్ 2022లో పారిస్ లోని ఈఫిల్ టవర్ ముందు సోహైల్ డ్రీమీ ప్రపోజల్స్ కి సంబంధించిన ఫోటోలను హన్సిక షేర్ చేసింది. ఈ జంట 4 డిసెంబర్ 2022న జైపూర్- ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో వివాహం చేసుకున్నారు.

సోహైల్ తో డేటింగ్ చేయడానికి ముందు హిందీ- తమిళం- తెలుగు – మలయాళ చిత్రాలలో నటించిన హన్సిక తమిళ నటుడు సింబు అలియాస్ సిలంబరసన్ థెసింగు రాజేందర్ తో చాలా సంవత్సరాలు సంబంధం కొనసాగించింది. ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారని కూడా వరుస కథనాలు వెలువడినా ఆ బంధం ముందుకు సాగలేదు.

నిజానికి పెళ్లికి ఓకే చెప్పడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ‘అవును’ అని చెప్పడానికి నాకు కనీసం 7-8 సంవత్సరాలు పట్టింది. నాకు ప్రేమపై నమ్మకం ఉంది. నేను రొమాంటిక్ గా ఉండే వ్యక్తిని కానీ రొమాంటిక్ పర్సన్ గా చాలా ఎక్స్ప్రెసివ్ కాను. నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. ప్రేమను నమ్ముతాను. నిజం చెప్పాలంటే నేను సమయం తీసుకున్నాను. ఎప్పటికీ నాలాగా ఉండే వ్యక్తికి అవును అని చెప్పాలనుకున్నాను. సోహైల్ ప్రేమను మరింత ఎక్కువగా నమ్ముతాను. నేను అతని కోసం తలవంచుకునేలా నన్ను చూసుకున్నాడు. అవును దేవుడు తన స్వీయ మార్గం కలిగి ఉన్నాడు” అని హన్సిక అన్నారు.

శింబుతో తనకున్న రిలేషన్ షిప్ నుండి ఏవైనా పాఠాలు నేర్చుకున్నారా? అని హన్సికను అడిగినప్పుడు ”లేదు… అది వేరే సంబంధం.. అది ముగిసింది..” అని సమాధానమిచ్చారు. ఇప్పటిది భిన్నమైన సంబంధం. దానికి కొత్త ప్రారంభం ఉంది. ప్రతి సంబంధానికి దాని స్వీయ మార్గం ఉందని నేను భావిస్తున్నాను. నేటి బంధం తన గమ్యాన్ని కలిగి ఉందని నేను భావిస్తున్నాను” అని తెలిపింది.

హన్సిక మోత్వాని చివరిసారిగా 2022లో తమిళ చిత్రం ‘మహా’లో కనిపించారు. ఆమె షో హన్సిక ‘లవ్ షాదీ డ్రామా’లో సోహెల్ ఖతురియాతో విలాసవంతమైన వివాహం గురించి వారి సంబంధాన్ని పబ్లిక్గా చేసిన వైనం గురించి అలాగే వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా మాట్లాడారు. హన్సిక ‘లవ్ షాదీ డ్రామా’ ఫిబ్రవరి 10న డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రదర్శించారు.