ప్లాస్మా దానంపై జక్కన్న మాటలు

సైబరాబాద్‌ పోలీసులు ప్లాస్మా దానం అవగాహణ కార్యక్రమాలు ఈమద్య కాలంలో వరుసగా నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మెగాస్టార్‌ చిరంజీవితో ప్లాస్మా దానంకు సంబంధించిన అవగాహణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ప్లాస్మా దానం చేసిన వారిని సన్మానించారు. తాజాగా రాజమౌళి కూడా ప్లాస్మా దానం అవగాహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవలే కరోనా నెగటివ్‌ అంటూ నిర్థారణ అయిన రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి మరీ ప్లాస్మా దాతలను సన్మానించాడు.

ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ.. ప్లాస్మా దానం గురించి ఉన్న పుకార్లు అనుమానాలు అన్ని కూడా నిజం కాదు. ప్లాస్మా దానం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ప్లాస్మా దానంకు ఏ ఒక్కరు కూడా భయపడవద్దంటూ ఆయన సూచించాడు. కరోనాను సకాలంలో గుర్తించినట్లయితే ఎలాంటి ఆందోళన లేకుండా దాని నుండి బయట పడవచ్చు. పౌష్టిక ఆహారం తీసుకోవడంతో పాటు రెగ్యులర్‌గా వైధ్యులు సూచించినట్లుగా చేయడం వల్ల తక్కువ సమయంలోనే కరోనాను జయించవచ్చు అంటూ జక్కన్న మరియు రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు.