ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్: అంత తక్కువ కలెక్షన్స్ చూసి షాక్ తిన్న ‘మోసగాళ్లు’ టీం


కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మంచు విష్ణు సొంత కథతో ఎంతో రిస్క్ చేసి చేసిన ఫిలిం ‘మోసగాళ్లు‘కి ప్రేక్షకుల నుంచి ఆశించిన ఫలితం రాలేదు. టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్ స్కామ్ ని బేస్ చేసుకొని చేసిన ఈ సినిమా మొదటి రోజు మరీ తక్కువ కలెక్షన్స్ ని సాధించింది. విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర లాంటి తెలిసిన స్టార్స్ ఉన్నా థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించలేకపోవడంతో ట్రేడ్ వర్గాలు షాక్ లో ఉన్నాయి. విష్ణు ఓన్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా కలెక్షన్స్ చూసి నిర్మాతలే షాక్ లో ఉన్నారు.

ఏపీ – తెలంగాణలో ఏరియాల వారీగా మొదటి రోజు ‘మోసగాళ్లు’ కలెక్షన్స్:

నైజాం: 14 లక్షలు
సీడెడ్: 6 లక్షలు
ఉత్తరాంధ్ర: 4 లక్షలు
ఈస్ట్: 2 లక్షలు
వెస్ట్: 1.8 లక్షలు
గుంటూరు: 2.5 లక్షలు
కృష్ణ: 2 8 లక్షలు
నెల్లూరు: 1.5 లక్షలు

ఏపీ తెలంగాణాలో ‘మోసగాళ్లు’ ఫస్ట్ వీక్ మొత్తం షేర్: 34.6 లక్షలు

కర్ణాటక + ఇండియా – 3 లక్షలు

ఓవర్సీస్ – 3 లక్షలు

వరల్డ్ వైడ్ మోసగాళ్లు ఫస్ట్ డే షేర్ – 40.6 లక్షలు