రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరస ప్లాపుల వల్ల కెరీర్ కొంత డౌన్ అయిన విషయం తెల్సిందే. అయితే తన క్రేజ్ కు మాత్రం ఏమాత్రం లోటు లేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. నలభై రోజులు ముంబై లో షూటింగ్ చేసిన తర్వాత కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. మొదటినుండి ఈ చిత్రానికి టైటిల్ గా ఫైటర్ అని ప్రచారం జరుగుతుంది.
షూటింగ్స్ ఆగిపోయి మూడు నెలలు కూడా దాటిపోయింది. షూటింగ్ లు అన్నీ మరో నెల, 15 రోజుల్లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ లాక్ డౌన్ గ్యాప్ లో ఫైటర్ స్క్రిప్ట్ లో భారీ మార్పులు జరిగాయని గట్టిగా ప్రచారం నడిచింది. పూరి జగన్నాథ్ ఈ కథను మరమ్మత్తులు చేపట్టాడని అన్నారు.
అయితే ఈ రూమర్స్ పై ఫైటర్ సహ నిర్మాత ఛార్మి స్పందించింది. ఫైటర్ స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు జరగలేదని, ఇది ఒక బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ అని, అసలు మార్పులు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే ఈ సినిమా ఒరిజినల్ టైటిల్ మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని కూడా వెల్లడించింది.
అనన్య పాండే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కరణ్ జోహార్ కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెల్సిందే.