ఫ్యామిలీ స్టార్ లో పెద‌వి ముద్దులా?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌లో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సీన్ డిమాండ్ చేసిందంటే? ఎంత‌టి రొమాంటిక్ స‌న్నివేశాన్ని అయినా అవలీల‌గా చేస్తాడు. అందులో అత‌డు పూర్తిగా ద‌ర్శ‌కుల హీరో అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త‌గా కెరీర్ ప్రారంభించిన న‌టుడు..యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న న‌టుడు. అలాంటి న‌టుడికి రొమాంటిక్ ఇమేజ్ అనేది అంతే కీల‌కం. అందుకే విజ‌య్ ఆ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డు. లెక్క‌కు మిక్కిలి రొమాన్స్ పండించ‌డంలో త‌న‌దైన మార్క్ త‌ప్ప‌న‌స‌రిగా వేస్తాడు.

‘అర్జున్ రెడ్డి’..’డియ‌ర్ కామ్రేడ్’..’లైగ‌ర్’ చిత్రాలతో ఇప్ప‌టికే రొమాంటిక్ ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. ‘గీత‌గోవిందం’ లాంటి ఫ్యామిలీ సినిమాలోనూ ఘాటైన లిప్ లాక్ తో రొమాంటిక్ ట‌చ‌ప్ ఇచ్చాడు. మ‌రి అలాం టి స్టార్ ని ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ గా మ‌లుస్తోన్న ప‌ర‌శురాం మ‌రోసారి త‌న‌లోని రొమాంటిక్ యాంగిల్ ని త‌ట్టిలేపాడా? అంటే అందుకు నూరుశాంత ఛాన్స్ ఉంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి.

విజ‌య్-మృణాల్ ఠాకూర్ మ‌ధ్య ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాలు…పెదవి ముద్దులు సైతం డీసెంట్ గా సినిమాలో హైలైట్ చేయ‌బోతున్నాడుట‌. గీత‌గోవిందం త‌ర‌హాలోనే రొమాన్స్ త‌న‌దైన మార్క్ లో ఎలివేట్ చేస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కు ప‌ర‌శురాం ఆ స్టెప్ తీసుకున్నాడ‌ని అంటున్నారు. అయితే ప‌ర‌శురాం త‌న గ‌త చిత్రాల్ని మించి ఇందులో రొమాన్స్ డోస్ కాస్త పెంచుతు న్న‌ట్లుగానే ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఇది నిజ‌మైతే మృణాల్ కోరిక తీరుతున్న‌ట్లే.

రొమాంటిక్ పాత్ర‌ల్లో న‌టించాల‌ని అమ్మ‌డు త‌హ‌త‌హ‌లాడుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ అమ్మ‌డు అన్ని డీసెంట్ రోల్స్ లోనే మెప్పించింది. గ్లామ‌ర్ గా…రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించే ఛాన్స్ రాలేదు. ఇప్పుడా ఛాన్స్ ఫ్యామిలీ స్టార్ రూపంలో ముందున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో మేక‌ర్స్ ధృవీక‌రించాల్సి ఉంది.