బంగారు బాతును ప‌ట్టింద‌న్న వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్

నా వ్య‌క్తిగ‌త జీవితంలో త‌ల‌దూర్చ‌డానికి మీరు ఎవ‌రు? ఇది ఒక‌రి బిజినెస్ కాదు.. పూర్తిగా నా వ్య‌క్తిగ‌తం! అని వ్యాఖ్యానించారు సుస్మితాసేన్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఇటీవ‌ల‌ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ తో రిలేష‌న్ లో ఉన్నాన‌ని ప్రకటించినప్పుడు చాలామంది ఎగ‌తాళి చేసారు. ప్రియుడు రోహ్మాన్ షాల్ నుంచి విడిపోయిన కొన్ని నెలలకు ల‌లిత్ తో రిలేష‌న్ విష‌య‌మై సుస్మిత‌ ఓపెన‌వ్వ‌గా నెటిజ‌నుల్లో తీవ్ర‌మైన కామెంట్లు వినిపించాయి.

సుస్మిత తన ప్రేమికురాలని లలిత్ మోడీ కూడా పేర్కొన్నాడు. జంట‌గా కలిసి హాలిడేను ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసారు. ఒక‌రిపై ఒక‌రి ప్రేమ‌ను బ‌హిర్గ‌తం చేసారు. ప్రతిస్పందనగా ప్రజలు సుస్మితాసేన్ ని ఎగతాళి చేసారు. ‘బంగారు బాతు’ను ప‌ట్టిందంటూ అవ‌మాన‌క‌రంగా మాట్లాడారు.

సుష్ పై నెటిజ‌నులు అవమానకరమైన పదాలను ఉపయోగించారు. అయితే ఎవ‌రు ఎలా స్పందించినా దేనినీ సుస్మిత ఖాత‌రు చేయ‌లేదు. గౌరవప్రదమైన మౌనాన్ని కొనసాగించింది. తన వ్యక్తిగత జీవితంతో ఇతరులకు ఎలాంటి సంబంధం లేద‌ని మాత్ర‌మే సుస్మిత అన్నారు.

సుస్మితాసేన్ న‌టించిన తాజా చిత్రం ‘తాళి’ని ప్రమోట్ చేస్తున్న సమయంలో ఇంటర్వ్యూలో మోడీతో ప్రేమాయ‌ణం టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. నాటి ఆరోపణలపై మరోసారి సుష్ స్పందించింది. త‌న‌పై నింద‌ల గురించి అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌ల గురించి సుస్మితాసేన్ చాలా గ్యాప్ త‌ర్వాత స్పందించారు.

న‌న్ను గోల్డ్ డిగ్గ‌ర్ అంటూ అవ‌మానించారు. ఇలాంటి కామెంట్ల‌ను ఇత‌రులు మ‌న‌సులోకి తీసుకుంటారు. వారి బాధ‌ల్ని తీసుకునే అల‌వాటు నాకు లేదు. కానీ ఇత‌రుల‌కు సంబంధం లేని వ్య‌వ‌హార‌మిది. ఇది ఒక‌రి బిజినెస్ కానేకాదు.. అని సుస్మిత వ్యాఖ్యానించింది.

సుస్మితా సేన్‌తో తన సంబంధానికి సంబంధించి లలిత్ మోడీ ప్రకటనపై నెటిజన్లు ఎప్పుడూ ఆసక్తిగా ఉన్నారు. కానీ సుస్మిత దేనినీ పట్టించుకోలేదు. ఆమె సింగిల్ స్టేటస్ గురించి ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటుంది. తాజా చిత్రం తాళిలో సుస్మితా సేన్ స్వ‌లింగ సంప‌ర్కురాలి (లింగమార్పిడి యువ‌తి) పాత్రలో నటించింది. ట్రైల‌ర్ లో సుస్మిత న‌ట‌న అబ్బుర‌ప‌రిచింది. ఈ సినిమాతో పాటు ఆర్య 3 కోసం కూడా సుస్మితాసేన్ సిద్ధమవుతోంది.