బాగా మగ్గిన బంగినపల్లి మామిడిపండులా మహేష్..

టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరు, బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అన్నదానికి డిబేట్లు నడుస్తుంటాయి కానీ ఎవరు మోస్ట్ హ్యాండ్సం, ఎవరు అందగాడు అంటే ఎటువంటి డిబేట్లు ఉండవు, అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. బెస్ట్ లుక్స్ పరంగా బాలీవుడ్ హీరోలానే కాదు, హాలీవుడ్ హీరో అన్న భావన కలిగిస్తాడు మహేష్. 40ల్లో ఉన్నా కూడా 25 ఏళ్ల యువకుడి లుక్స్ తో మహేష్ అమ్మాయిల మనసులనే కాదు, అబ్బాయిలను కూడా మెస్మరైజ్ చేస్తుంటాడు.

లేటెస్ట్ గా లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు, ఫ్యామిలీతో క్వాలిటీ సమయాన్ని గడుపుతున్న విషయం తెల్సిందే. ఎప్పుడూ బిజీ లైఫ్ లో ఇంటిపట్టున పెద్దగా ఉండని మహేష్, గత రెండు నెలలుగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ భార్య నమ్రత ఎప్పటికప్పుడు మహేష్, వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు వంటివి పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.

ఇక రీసెంట్ గా నమ్రత పోస్ట్ చేసిన మహేష్ పిక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ లాక్ డౌన్ వల్ల మహేష్ అందం మరింత పెరిగినట్లు అనిపిస్తోంది. నటుడు బ్రహ్మాజీ అయితే బాగా మగ్గిన బంగినపల్లి మామిడిపండులా మహేష్ ఉన్నాడని పోస్ట్ చేసాడు. ఇక నిర్మాత బండ్ల గణేష్ కూడా హాలీవుడ్ సూపర్ స్టార్స్ కు ఏ మాత్రం తగ్గని విధంగా మహేష్ ఉన్నాడని పోస్ట్ చేసాడు.

సెలబ్రిటీలే ఇలా ఫీలవుతుంటే ఇక సామాన్యులు ఏమనుకుంటున్నారో.