బాబు షర్టుకే అన్ని వేలా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న కూడా ఇంకా పాతికేళ్ల కుర్రాడి తరహాలోనే అట్రాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా బెస్ట్ హ్యాండ్సమ్ లుక్స్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు వెండి తెరపై ఎలా కనిపిస్తాడో అలాగే ఆఫ్ స్క్రీన్ కూడా అంతే గ్లామర్ తో కనిపిస్తూ ఉంటాడు.

మహేష్ బాబు లుక్కు వెనక కూడా చాలా కష్టం దాగి ఉంది. అతను మెయింటైన్ చేసే డైటింగ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చేయడు అనే విధంగా కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. పెద్దగా బాడీని బిల్డ్ చేయకపోయినప్పటికీ కూడా మహేష్ బాబు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు అని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు ఫ్యాషన్ గురించి కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి.

అతను ఎప్పుడు బయట కనిపించినా కూడా డ్రెస్ స్టైల్ పై కూడా అందరి ఫోకస్ పడుతూ ఉంటుంది. ఇక రీసెంట్ గా బిగ్ సి ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు ఒక చొక్కా తో మాత్రం బాగానే అట్రాక్ట్ చేశాడు. ఇక షర్ట్ కు సంబంధించిన ప్రైస్ ట్యాగ్స్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాన్స్ కూడా మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

డీజిల్ బ్రాండ్ కు చెందిన ఆ షర్ట్ విలువ దాదాపు 18 వేలు ఉంటుంది అని తెలుస్తోంది. మహేష్ బాబు గతంలో కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో డ్రెస్సింగ్ స్టైల్ ను ఫాలో అయ్యాడు. మహేష్ బాబు నవ్వుకి ఆ డ్రెస్సింగ్ కి మరింత అందం వచ్చింది అని ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం బాబు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని చిత్ర యూనిట్ టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చు అని గతంలో చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తప్పకుండా సంక్రాంతికి సినిమా వస్తుంది అని మహేష్ బాబు క్లారిటీ చేశాడు.