ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ శౌర్య ఉన్నంత బిజీగా మరో నటుడు లేరేమో. నాగ శౌర్య నటిస్తోన్న మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. సంతోష్ జాగర్లపూడి హీరోగా ఆర్చర్ రోల్ లో కనిపిస్తున్నాడు ఈ హీరో. ఇక వరుడు కావలెను సినిమాలో రొమాంటిక్ రోల్ లో కనిపిస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే సినిమాలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు నాగ శౌర్య.
ఇవి కాకుండా మరో మూడు సినిమాలు అనౌన్స్ కాకుండా ఉన్నాయి. అందులో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఒకటి కాగా రాజా కొలుసు అనే నూతన దర్శకుడ్ని పరిచయం చేస్తూ నాగ శౌర్య నటించనున్నాడు. ఇక మరో సినిమాలో నందమూరి బాలకృష్ణతో కలిసి ఈ యువ హీరో నటించబోతున్నాడట.
కొత్త కుర్రాడు శ్రీమాన్ వేముల దర్శకుడిగా పరిచయం అవ్వనున్న సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తారని, అంతే కాకుండా ఈ చిత్రంలో నాగ శౌర్య డెఫ్, మ్యూట్ పాత్రలో విభిన్నంగా కనిపించనున్నాడని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా గురించి కానీ, పాత్ర గురించి కానీ స్పందించడానికి శౌర్య సిద్ధంగా ఉన్నాడు. నో కామెంట్స్ అని తప్పించుకుంటున్నాడు. మరి చూడాలి దీని గురించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.