బాలీవుడ్.. ఓ సీక్రెట్ బయటపెట్టిన సాయి పల్లవి

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ సాయి పల్లవి. ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయిన టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం మనసుకి నచ్చే కథలకి మాత్రమే సాయి పల్లవి ఒకే చెబుతుంది. మూవీలో క్యాస్టింగ్ ఎవరనేది అస్సలు పట్టించుకోదు. కథ, అందులో తన క్యారెక్టర్ నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయిన సున్నితంగా రిజక్ట్ చేస్తుంది.

ఇదిలా ఉంటే సాయి పల్లవి నటించిన ‘అమరన్’ మూవీ దీపావళికి రిలీజ్ కాబోతోంది. శివ కార్తికేయన్ కి జోడీగా ఈ చిత్రంలో సాయి పల్లవి నటించింది. తెలుగులో నాగ చైతన్యకి జోడీగా ‘తండేల్’ లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చేసింది. అలాగే హిందీలో ‘రామాయణం’ మూవీలో సీతగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదిలా ఉంటే ‘అమరన్’ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కొంతకాలం క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశారు. నన్ను ప్రమోట్ చేసుకోవడానికి, ప్రతి రోజు వార్తల్లో ఉండటం కోసం పీఆర్ కావాలా అని అడిగారు. అయితే పీఆర్ ని పెట్టుకొని నన్ను నేను ప్రమోట్ చేసుకోవడం వలన ఎలాంటి ఉపయోగం లేదనిపించింది. తరుచూ నా గురించి వార్తలు వస్తుంటే ప్రేక్షకులకి కూడా బోర్ కొడుతుంది. అందుకే పీఆర్ జోలికి వెళ్లలేదని చెప్పింది. చాలా మంది బాలీవుడ్ బ్యూటీస్ సోషల్ స్టేటస్ కోసం, అలాగే తన ఇమేజ్ ని పెంచుకోవడానికి పీఆర్ లని పెట్టుకుంటారు.

పీఆర్ ల వలన అవకాశాలు రాకపోయిన లైమ్ లైట్ లో ఉంటారు. తద్వారా దర్శక, నిర్మాతల దృష్టిలో పడొచ్చని భావిస్తారు. అయితే కథల విషయంలో సాయి పల్లవి దగ్గర డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందని టాక్. ఎవరైనా వెళ్లి స్టోరీస్ నేరేట్ చేయొచ్చు. అలాగే సోషల్ మీడియాలో ఫేమ్ కోసం సాయి పల్లవి అంతగా ఆసక్తి చూపించదు. ఆమె సోషల్ అంత యాక్టివ్ గా ఉండదు. అప్పుడప్పుడు సినిమా అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తన ఫ్యామిలీతో స్పెండ్ చేసిన ఫోటోలని పంచుకుంటుంది.