బింబిసార సినిమాతో మొదటి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు వశిష్ట మల్లిడి. కళ్యాణ్ రామ్ కెరియర్ కి కూడా బింబిసార మూవీతో పటాస్ తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ హాయ్ ఇచ్చాడు. దీంతో టాలీవుడ్ లో ఈ యువ దర్శకుడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడానికి వశిష్ట మల్లిడి రెడీ అవుతుననడనే టాక్ ప్రచారంలో ఉంది.
దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అయితే ఇంతలో ఈ దర్శకుడు అనవసరమైన వివాదంలో ఇరుక్కున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఇలాంటి ట్రోలింగ్ వీడియోని వశిష్ట మల్లిడి ట్విట్టర్ లో లైక్ చేసాడని రామ్ చరణ్ అభిమానుల ఆరోపణ.
ఇక రామ్ చరణ్ మీద ట్రోలింగ్ వీడియోని లైక్ చేసాడని తెలియడంతో చెర్రి అభిమానులు అతనిపై ట్విట్టర్ లో విమర్శలు చేస్తున్నారు. దీంతో అతను తన ప్రొఫైల్ ని లాక్ చేసాడు.
అయితే మెగా అభిమానులు మాత్రం వదలకుండా సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా అభిమానులు రిక్వెస్ట్ చేస్తూ ఉండటం విశేషం.
వశిష్ట మల్లిడితో అనుకున్న ప్రాజెక్ట్ ఒకే చేయొద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు. అతని చర్యలని మెగా అభిమానులు అందరూ హర్ట్ అయ్యారని కచ్చితంగా మరల తనను తానుగా వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకపోతే సినిమా చేయొద్దు అని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది.
మెగాస్టార్ ప్రస్తుతం భోళా శంకర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత వశిష్ట మల్లిడితో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ ట్రోలింగ్ వీడియోని వశిష్ట మల్లిడి లైక్ చేయడం వివాదంగా మారి మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.