తెలుగు బిగ్ బాస్ ఈవారం కూడా ముగిసి పోయింది. శుక్రవారం ఎపిసోడ్ లో ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం ఇచ్చేందుకు ఇచ్చిన చివరి టాస్క్ ను ఇంటి సభ్యులు చేశారు. కంటిన్యూగా డాన్స్ చేస్తూ చివరి వరకు మిగిలి ఉన్న కంటెస్టెంట్ కు గోల్డ్ మైక్ అంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇప్పటికే అరియానా రెండు సార్లు సోహెల్ ఒకసారి టాస్క్ ల్లో గెలిచి విజయాన్ని సొంతం చేసుకుని గోల్డ్ మైక్ ను దక్కించుకున్నారు. చివరిదైన డాన్స్ టాస్క్ లో వారిద్దరు తప్పుకునేందుకు సిద్దం అయ్యారు. అయితే మొదట ఎవరు అనే విషయంలో మాత్రం కాస్త చర్చ జరిగింది.
టాస్క్ సరిగా అర్థం చేసుకోకుండా వాదన జరుగుతున్న సమయంలో అభిజిత్ కింద కూర్చుండి పోయాడు. ఆ విషయంలో బిగ్ బాస్ ఆదేశం మేరకు అలా కూర్చోవద్దు అంటూ మోనాల్ చెప్పడం.. అప్పుడు అంతా కూడా ఔను అలా కూర్చోవద్దంటూ టాస్క్ పేపర్ ను తీసుకు రావడంతో వాదించకుండా వెంటనే దిగి పోయాడు. ఇక రెండవ రౌండ్ లో అరియానా ఇంటి సభ్యుల కోసం అంటూ దిగి పోయింది. ఇక ఆ తర్వాత సోహెల్ కోసం కావాలంటే మొండిగా ఆడవచ్చు, కాని మీకు కూడా అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అందుకే దిగుతున్నాను అంటూ హారిక మరియు మోనాల్ లను ఉంచేసి దిగి పోయాడు. వారిద్దరిలో ఎవరు అంటూ వచ్చినప్పుడు మోనాల్ బలంగానే కోరింది. నాకు గోల్డ్ మైక్ కావాలని ఉంది అంటూ మోనాల్ అన్నప్పుడు హారిక నో చెప్పలేక పోయింది. తనను కెప్టెన్సీ టాస్క్ లో అంతగా ఎత్తుకోవడం వల్ల ఇప్పుడు ఈ టాస్క్ ను ఆమెకు ఇచ్చేస్తున్నట్లుగా హారిక చెప్పేసి వెళ్లి పోయింది.
టాస్క్ విన్నర్ అయిన మోనాల్ కు గోల్డ్ మైక్ లభించింది. దాంతో కన్ఫెషన్ రూంకు వెళ్లి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తీసుకు వచ్చిన వారు మరో అడుగు ముందుకు వేసేందుకు సహకరించండి అంటూ ఓట్లను కోరింది. మోనాల్ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. అయితే ఈ ఆనంద సమయంలో మోనాల్ కన్నీరు పెట్టుకోవడం చెప్పుకోదగ్గ విషయం. మోనాల్ ఖచ్చితంగా కన్నీరు పెట్టుకుంటుంది అనుకున్నారు. కాని గోవింద గోవింద అంటూ తన ఆందాన్ని ప్రేక్షకులతో పంచుకుని ఓట్లు అడిగింది.
మరో వైపు హారికతో అఖిల్ కలుపుతున్న పులిహోర మామూలుగా లేదు. తాజా ఎపిసోడ్ లో ఆమె వద్దకు వెళ్లి ఇంత మంచి స్మెల్ వస్తుంది ఏం వాడుతున్నావు మాకు ఇవ్వొచ్చుగా అంటూ ఆమెను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మోనాల్ అక్కడే ఉన్నా కూడా హారికతో పిచ్చి పిచ్చిగా మరో లెవల్ పులిహోర కలుపుతున్నాడు. ఆ సమయంలో మోనాల్ మంట క్లీయర్ గా కనిపించింది. హారిక మాత్రం అఖిల్ ఎంతగా తనకోసం పులిహోర కలుపుతున్నా కూడా వెళ్లి అభిజిత్ కు హగ్ లు ముద్దులు ఇస్తుంది. మొత్తానికి హారిక ఇప్పుడు ప్రేమదేశం టబు అయ్యింది అనిపిస్తుంది. ఈ వారం హారిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. చివరి వారం పులిహోర కోసం హారికను బిగ్ బాస్ టీం ఏమైనా సేవ్ చేసేనా చూడాలి.