బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు వచ్చింది. మరో వారం రోజులు మాత్రమే ఉన్న ఈ సీజన్ లో ప్రస్తుతం హౌస్ లో ఆడియన్స్ కు డైరెక్ట్ గా ఓటింగ్ అప్పీల్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు. ఐతే అది వారికిచ్చిన టాస్క్ గెలిస్తేనే ఆ ఛాన్స్ వస్తుంది. ఈ టాస్క్ తో పాటుగా హౌస్ లోకి కొంతమందిని పంపించి వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు. గురువారం ఎపిసోడ్ లో బ్యాండ్ వచ్చి కంటెస్టెంట్స్ ని అలరించారు.
ఇక ఆల్రెడీ ప్రేరణ, నబీల్ ఓటింగ్ అప్పీల్ చేయగా విష్ణు ప్రియ కూడా ఆ ఛాన్స్ దక్కించుకుంది. మరోపక్క ఈ టాస్కుల్లో గౌతం తన బెస్ట్ ఇస్తున్నాడు. అసలే టైటిల్ రేసులో ఉన్న గౌతం ఈ టాస్కుల్లో ఇస్తున్న పర్ఫార్మెన్స్ తో దూసుకెళ్తున్నాడు. మరోపక్క టైటిల్ రేసులో ఉన్న నిఖిల్ ఎందుకో కాస్త డల్ అయ్యాడు. నిఖిల్ టాస్కుల్లో కూడా అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు.
ఓటింగ్ కు ఛాన్స్ ఉన్న ఈ చివరి వారాల్లో నిఖిల్ ఇలా తన ఫోకస్ కోల్పోవడం ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. రోజు రోజుకి గౌతం రైజ్ అవుతుంటే నిఖిల్ గ్రాఫ్ పడిపోతోంది. ఐతే వైల్డ్ కార్డ్ గా వచ్చి గౌతం టైటిల్ విన్నర్ అయితే అది నిజంగానే సంచలనం అవుతుంది. ఐతే నిఖిల్ కి కూడా టైటిల్ గెలిచే ఛాన్స్ 100 శాతం ఉంది. ఈ ఇద్దరిలో ఎవరిది టైటిల్ అవుతుంది అన్నది మరో వారం తర్వాత తెలుస్తుంది.
నిఖిల్ ముందు నుంచి తన దూకుడు ఆటతో మెప్పిస్తూ వచ్చాడు. కాకపోతే అతను సోనియా, సీత, యష్మి ఇలా అమ్మాయిలతో క్లోజ్ గా ఉండి వారి విషయంలో డబుల్ గేమ్ ఆడటం వల్ల అతని గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అయినా కూడా నిఖిల్ పడుతూ లేస్తూ అన్నట్టుగా తన బెస్ట్ ఇచ్చేందుకు చూస్తున్నాడు. మరి నిఖిల్ గౌతం లో సీజన్ 8 విజేత ఎవరు అవుతారన్నది చూడాలి.
బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ విన్నర్ మాత్రమే కాదు టాప్ 6కి ఎవరు వెళ్తారన్నది కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ వీక్ నబీల్, రోహిణి, విష్ణు ప్రియలో ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోతారని టాక్. సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. మెగా చీఫ్ గెస్ట్ అతిథిగా కూడా రాబోతున్నారని తెలుస్తుంది.