బిగ్ షాక్.. షూటింగ్ లో గాయపడిన సీనియర్ హీరోయిన్స్!


సినిమా షూటింగ్లో పాల్గొనడం కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగానే ఉంటుంది. ముఖ్యంగా హడావుడి చేసే సన్నివేశాలలో ఏమాత్రం పట్టు జారినా కూడా కొన్నిసార్లు తీవ్రంగా గాయాలు అవుతూ ఉంటాయి. అందుకే సినీ తారల రక్షణ విషయంలో నిర్మాతలు దర్శకులు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఏమాత్రం రిస్కు తీసుకోకుండా వర్క్ చేస్తూ ఉంటారు.

అయితే రీసెంట్గా మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇద్దరు హీరోయిన్లు ఒకేసారి వారి సినిమా షూటింగ్లో గాయాలు పాలవడం హాట్ టాపిక్ లో మారిపోయింది. వారు మరెవరో కాదు. ఇద్దరు కూడా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చినవారే. సాగర కన్య సాహస వీరుడు హీరోయిన్ శిల్పా శెట్టి బాలీవుడ్లో ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఆమె ఇటీవల ఒక సినిమా షూటింగ్లో పరిగెత్తుతున్న సన్నివేశంలో నటిస్తూ ఉండగా పట్టు జారీ కింద పడిపోయింది. ఆమె మోకాలికి తీవ్రంగా గాయం కావడంతో వెంటనే షూటింగ్స్ స్పాట్ కి వైద్యుడిని పిలిపించారు. నడపలేని పరిస్థితిలో ఉండడంతో ఆ విధంగా చేయాల్సి వచ్చిందట. ఇక ఆమె పర్సనల్ కారావాన్ లోనే వైద్యులు ఆమెకు పట్టి కూడా కట్టినట్లుగా తెలుస్తోంది.

ఇక మరోవైపు మరొక సినిమా సెట్ లో టబు కూడా గాయపడింది. హిందీ ఖైదీ సినిమా రీమేక్ లో అజయ్ దేవగన్ నటిస్తుండగా అందులో ముఖ్యమైన పాత్రలో టబు నటిస్తోంది. ఇక ఆమె కూడా ఒక గొడవ పడే సన్నివేశంలో నటిస్తూ కింద పడిపోయిందట. ఆమెకు పెద్దగా గాయాలు తగలేదు షూటింగ్ చేయలేని పరిస్థితిలో ఉందట.

మొత్తంగా అయితే వీరి గాయాల కారణంగా సినిమా షూటింగ్ లు కొంత వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. నటీనటుల గాయల కారణంగా నిర్మాతలకు కూడా ఒక విధంగా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

షూటింగ్ ఆలస్యం అవుతూ ఉంటే తెచ్చిన అప్పుకు వడ్డీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి షూటింగ్లో వీలైనంత వరకు గాయాలు బారిన పడకుండా ఉండేందుకు సినీ తారలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.