తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 షురూ అయ్యింది. ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో చాలా నిరుత్సాహం వ్యక్తం అవుతుంది. ఒక్కరు ఇద్దరు మినహా మిగిలిన వారు అంతా కూడా ఫేడ్ ఔట్ అయిన వారు.. ఏమాత్రం క్రేజ్ లేని వారు అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ సీజన్ లో గంగవ్వ ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఆమె కాకుండా మంచి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ లాస్య. ఈమె యాంకర్ గా చేయడం మానేసి చాలా కాలం అయినా కూడా ఇంకా ఈమెకు సోషల్ మీడియాలో క్రేజ్ ను కలిగి ఉన్నాడు. అందుకే ఆమెను కాస్త ఎక్కువ పారితోషికం ఇచ్చి మరీ నిర్వాహకులు తీసుకు వచ్చారు.
షో లో ఉన్న అమ్మాయిల కంటే ఒక బిడ్డకు తల్లి అయిన లాస్యకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన లాస్య ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ గా నిలిచింది. స్టార్ మా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రోజుకు లక్ష రూపాయల చొప్పున ఆమెకు పారితోషికంగా దక్కుతుందట. షో లో రోజుకు పది వేల పారితోషికం అందుకునే వాళ్లు కూడా ఉన్నారంటా. వారు ఎవరు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పది వేల నుండి లక్ష రూపాయల వరకు రోజు వారి పారితోషికాలు అందుకుంటున్న కంటెస్టెంట్స్ వారి పారితోషికంకు సంబంధం లేకుండా ఎంటర్ టైన్ మెంట్ అందిస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ పారితోషికం చాలా తక్కువ. అయినా కూడా ఆయన ప్రేక్షకుల హృదయాలను గెలుసుకుని ఏకంగా విన్నర్ అయ్యాడు. ఆయన పారితోషికం మరియు విన్నింగ్ ప్రైజ్ మనీ మొత్తం కలిపినా కూడా శ్రీముఖి పారితోషికం స్థాయిలో రాలేదు అనేది టాక్. ఇప్పుడు కూడా లాస్య అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఎవరు ఎక్కువ క్రేజ్ దక్కించుకుంటారు అనేది షో ముందు ముందు ఎపిసోడ్స్ ను చూస్తే అర్థం అవుతుంది.