కోలీవుడ్ లో చియాన్ విక్రమ్ సంచలనం గురించి తెలిసిందే. తమిళంలో ఉన్న విలక్షణ నటులల్లో ఆయన ఒకరు. ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో చేస్తున్న ప్రయోగాలన్నీ ఒకప్పుడు ఆయన చేశారు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని విక్రం పడే తపన ఆడియన్స్ కు నచ్చుతుంది. అయితే ఈమధ్య చియాన్ సినిమాలేవి ఆడియన్స్ ను మెప్పించట్లేదు. అతను చేసే సినిమాలు సరైన టైం లో రిలీజ్ అవ్వక అనుకోని ఇబ్బందులు పడుతున్నాయి. ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విక్రం చూస్తూ చూస్తూనే అక్కడ వెనుకబడ్డారు.
అయితే చియాన్ విక్రం తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ఆయన చేసిన సినిమాల్లో కొన్ని రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. తమిళంలో దళపతి విజయ్ రీమేక్ స్పెషలిస్ట్ గా చెప్పుకుంటారు. ఆయన చేసిన రీమేక్ సినిమాలు ఒరిజినల్ వెర్షన్ కన్నా సూపర్ హిట్ అవుతాయి. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ నటించిన ఒక్కడు సినిమా తమిళంలో గిల్లి గా రీమేక్ అయ్యింది. తెలుగులో గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంలో ధరణి డైరెక్ట్ చేశారు.
విజయ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ సినిమాల్లో గిల్లి ఉంటుంది. ఈమధ్య ఆ సినిమా రీ రిలీజ్ చేసి దళపతి ఫ్యాన్స్ చేసిన హంగామా తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాను ధరణి ముందు చియాన్ విక్రమ్ తో తీయాలని అనుకున్నారట. విక్రం ఆ సినిమాను చేయకపోవడంతో ఆ ఛాన్స్ విజయ్ కి వెళ్లింది. విక్రం ఆ సినిమా చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పొచ్చు. విక్రం మాత్రమే కాదు గిల్లిలో నటించిన త్రిషకు బదులుగా ముందు జ్యోతికను హీరోయిన్ గా అనుకున్నారట.
జ్యోతిక కు కుదరకపోవడంతో త్రిష ని తీసుకున్నారు. అలా విక్రమ్ బదులు విజయ్, జ్యోతిక బదులుగా త్రిష వచ్చి చేరారు. గిల్లి సినిమా విక్రమ్ చేజార్చుకోవడంతో ఒక సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యాడని చెప్పొచ్చు. గిల్లి రీ రిలీజ్ టైం లో చియాన్ విక్రమ్ ఈ రీమేక్ వదులుకున్నాడని తెలిసి చియాన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తెలుగులో కూడా ఒక్కడు సినిమాతోనే మహేష్ మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారని తెలిసిందే. తమిళంలో ఒక్కడు రీమేక్ గా చేసిన గిల్లి అప్పట్లో సూపర్ హిట్ కాగా రీ రిలీజ్ టైం లో ఈ సినిమా వసూళ్లు రికార్డులు సృష్టిస్తున్నాయి.