భర్తతో కంటే ఆ హీరోతో రొమాన్స్ ఇష్టమన్న హీరోయిన్‌

బాలీవుడ్ సినీ ప్రేమికులు, ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వారు అంతా కూడా ప్రముఖ ఫిల్మ్‌ మేకర్ కరణ్‌ జోహార్‌ హోస్టింగ్ చేసే కాఫీ విత్ కరణ్ టాక్ షో పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం కరణ్ టాక్ షో సీజన్‌ 8 రన్ అవుతోంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ను నేడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కి ముందే వచ్చిన ప్రోమో కి మంచి స్పందన వచ్చింది. దీపికా పదుకునే మరియు రణ్వీర్ సింగ్ కి సంబంధించిన ఎపిసోడ్‌ నేడు స్ట్రీమింగ్‌ అయింది. ఈ ఎపిసోడ్‌ కి సంబంధించిన ప్రోమో లో పలు ఆసక్తికర విషయాలను చూపించడం జరిగింది. ముఖ్యంగా దీపికా పదుకునేను పలు రొమాంటిక్ కమ్‌ వివాదాస్పద ప్రశ్నలను కరణ్ జోహార్ అడగడం.. ఆమె సింపుల్ గా సమాధానం చెప్పడం చేసింది.

ఏ హీరో తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ను ఇష్టపడుతారు అంటూ దీపికా పదుకునే ను కరణ్ జోహార్‌ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా హృతిక్‌ రోషన్ తో తాను ఆన్‌ స్క్రీన్ రొమాన్స్ ను బాగా ఎంజాయ్‌ చేస్తాను అంటూ దీపికా చెప్పుకొచ్చింది. తన భర్త ముందే మరో వ్యక్తితో ఆన్ స్క్రీన్‌ రొమాన్స్ ను ఎంజాయ్ చేస్తాను అంటూ చెప్పడం తో ఆ వీడియో కాస్త వైరల్‌ అయింది.

దీపికా పదుకునే 2018 లో రణ్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు దాదాపు అయిదు సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. ప్రేమించుకున్న ఇద్దరు వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగి కూడా అయిదేళ్లు అవుతోంది. ఇద్దరూ కూడా ప్రస్తుతం చాలా అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగిస్తున్న విషయం తెల్సిందే.

కరణ్ జోహార్ టాక్ షో లో ఇంకెంతగా దీపికా మరియు రణ్వీర్‌ సింగ్ ల జోడీ తమకు సంబంధించిన విషయాలను వెళ్లడించి ఉంటారు అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుకే స్ట్రీమింగ్‌ అవ్వడమే ఆలస్యం వెంటనే తెగ చూసేస్తున్నారు. ఎపిసోడ్‌ నుంచి ఎన్ని విషయాలు వైరల్‌ అవ్వబోతున్నాయో చూడాలి