మంత్రి రోజా ఇంట్లో సీనియర్ హీరోయిన్.. వైరల్!

ఒకప్పటి హీరోయిన్లలో రోజా, రమ్యకృష్ణ లకు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కాగా, ఈ ఇద్దరూ టాప్ హీరోయిన్లు సడెన్ గా కలుసుకున్నారు. ప్రస్తుతం రోజా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక రమ్య కృష్ణ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. స్టార్ హీరోల కు తల్లి పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. ఇక బాహుబలి లో ప్రభాస్ తల్లిగా చేసిన తర్వాత ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.

ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ కలుసుకున్నారు. రమ్యకృష్ణ తన కుమారుడితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత, వీరు తిరుగు ప్రయాణం లో మంత్రి రోజా ఇంటికి వెళ్లడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోల ను మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

కాగా, రమ్యకృష్ణకు రోజా సాదరంగా స్వాగతం పలికారు. తమ ఇంట్లో భోజనం కూడా పెట్టారు. అనంతరం రోజా ఆమెకు బొట్టు పెట్టి చీర, సారె పెట్టడం విశేషం. ఈ ఫోటోల ను షేర్ చేసిన రోజా, రమ్యకృష్ణ తో తన కు ఉన్న అనుబంధాన్ని తెలియజేయడం విశేషం. చాలా ఎమోషనల్ గా పంచుకున్నారు. తాను సారె పెడుతున్న వీడియో ని కూడా షేర్ చేశారు. అంతకముందు రమ్యకృష్ణని ఆమె సన్మానించడం విశేషం.

ఇద్దరు స్నేహితులు మంచి నక్షత్రాలు అని, మీరు వారిని ఎప్పుడూ చూడరు. కానీ వారు ఎల్లప్పుడూ అక్కడ ఉన్నారని మీకు తెలుసు. ఈ రోజు నా రోజు ని చాలా అందంగా మార్చిన నక్షత్రానికి తాను హృదయ పూర్వకంగా స్వాగతం చెబుతున్నాను అంటూ రమ్యకృష్ణను ఉద్దేశించి రోజా ఈ పోస్టు పెట్టడం విశేషం.

అంతేకాకుండా, ఆ రోజుల్లో తమ జీవితం చాలా ఆనందంగా ఉండేదని, చాలా నవ్వుకునే వాళ్లం అని, చాలా కాలం తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ ని కలుసుకున్నాను అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. వారి మ్యూచువల్ ఫ్యాన్స్ వీరి ఫోటోలు చూసి ఆనందిస్తున్నారు.