శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన డెబ్యూ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. దఢక్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు జాన్వీకు నటిగా చాలా మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ ఘోస్ట్ స్టోరీస్ లో నటించిన జాన్వీ ఇప్పుడు గుంజన్ సక్సేనా చిత్రంతో మన ముందుకు రానుంది. ముందు ఈ చిత్రాన్ని థియేటర్ లోనే విడుదల చేయాలని అనుకున్నా కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని ఆగష్టు 12న విడుదల చేస్తున్నారు.
1999 కార్గిల్ యుద్ధం సమయంలో గాయాలపాలైన సైనికులను విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించిన మహిళా పైలట్ గుంజన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గుంజన్ సక్సేనా ధైర్య సాహసాలను మెచ్చిన భారత ప్రభుత్వం ఆమెకు శౌర్య వీర్ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ లో నటించిన జాన్వీ ప్రస్తుతం మరో ఛాలెంజింగ్ రోల్ పై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే మలయాళ చిత్రం హెలెన్ ను చూసిన జాన్వీ అందులో హీరోయిన్ పాత్రకు ఫిదా అయిపోయిందట. కోల్డ్ స్టోరేజ్ లో చిక్కుకున్న యువత ఎలాంటి ఛాలెంజ్ లు ఎదుర్కొంది అనే అంశంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర రీమేక్ లో నటించాలని జాన్వీ కోరుకుంటోంది. మరి ఆమె కోరిక ఎంత వరకూ నెరవేరుతుందో చూడాలి. గుంజన్ సక్సేనా కాకుండా రూఅఫ్జానా, దోస్తానా 2 చిత్రాల్లో కూడా నటిస్తోంది జాన్వీ.