మల్లారెడ్డి మాటలు కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాంటివి: కేటీఆర్

సీఎం కేసీఆర్ కాలి గోటికి సరిపోని వ్యక్తులు కూడా అన్నేసి మాటలు అంటుంటే ఊరుకునేది లేదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డికి ఆవేశం ఎక్కువని.. ఆయనను, సీఎంను అన్నేసి మాటలు అంటున్నవారిపై తిరిగి వ్యాఖ్యలు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అన్నారు. ఏడేళ్లుగా మావాళ్లను సహనంతో ఉండమన్నామని.. ఇకపై వారిని ఆపలేమని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా చంద్రబాబు తొత్తు, బినామీ అయిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నియమించుకుందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు కానీ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ సీఎం అయ్యారని అన్నారు. అటువంటి వ్యక్తిని ఎవరెవరో ఏదో అంటుంటే కోపం రాక ఏమవుతుందని అన్నారు. బీజేపీ తీరుపై కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో మిగిలిన రాష్ట్రాలకు సాయం చేసిన కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపందని.. ఇది తెలిసి కూడా బండి సంజయ్ ఎందుకు సంగ్రామ యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు.