మళ్లీ వినిపిస్తోంది నిజం అవుతుందా?

#యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. సినిమా పై ఇప్పటికే వచ్చిన రకరకాల పుకార్లు అన్నింటిని పీఆర్ టీమ్ ఖండించింది. షూడింగ్ డిలే…హీరోయిన్ ఎవరు? సాంకేతిక నిపుణులు ఎవరు? అని నెట్టింట జరిగిన ప్రచారాలన్నింటిని కొట్టిపారేసి వచ్చేస్తున్నాం? అన్న సంకేతాలు పాస్ చేసింది.

మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నది క్లారిటీ ఇవ్వలేదు గానీ…అన్ని రకాల పుకార్లకు తాత్కాలికంగా పుల్ స్టాప్ మాత్రం పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి నాయిక విషయం వెబ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎంపికైందంటూ పాత పాటే మళ్లీ తెరపైకి వస్తుంది. టైగర్ -జాన్వీ జోడీ తెరపై అద్భుతంగా..అందంగా ఉంటుందని..చూడ ముచ్చటైన జంట అంటూ అంతా పొగిడేస్తున్నారు.

పాత్ర పరంగా జాన్వీ మాత్రమే ఆరో ల్ కి మ్యాచ్ అవుతుందని భావించి కొరటాల పట్టుబట్టి మరీ జాన్వీని ఎంపిక చేసినట్లు బలమైన ప్రచారం సాగుతోంది. సహజంగా కొరటాల సినిమాలో హీరోయిన్ అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేలా ఉండదు. నాయిక పాత్ర కు సమన్యాయం చేస్తారు. కొరటాల తొలి సినిమా నుంచి ఈ కండీషన్ ఫాలో అవుతున్నారు.

కథని మలుపు తిప్పడానికి హీరోయిన్ పాత్రని బలంగా రాస్తారు అన్న పీడ్ బ్యాక్ ఉంది. ఈ నేపథ్యంలో టైగర్ సినిమాలో జాన్వీనే అనుకుంటున్నారు అంటే? హీరోయిన్ పాత్ర ఇంకెంత స్ర్టాంగ్ గా ఉంటుందన్నది గెస్ చేయోచ్చు. ఇలా జాన్వీ పేరు వినిపించడం కొత్తేం కాదు. ఇప్పటికే అమ్మడి పేరు రేసులోకి వచ్చింది. అలియాభట్ తప్పుకోగానే జాన్వీ పేరునే తెరపైకి వచ్చింది.

ఆ తర్వాత పలువురు పేరున్న భామల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే మరోసారి అంతర్జాలంలో జాన్వీ పేరు హాట్ టాపిక్ మారడం విశేషం. ఇందులో ఎంతోకొంత వాస్తవం లేకపోతే అమ్మడి పేరు ఏ కారణంతో తెరపైకి వస్తుంది అని బలంగా వాదించే వాళ్లు లేకపోలేదు. మరి జాన్వీ ఉందా? లేదా? అన్నది యూనిట్ స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు.