‘మహేష్ – రాజమౌళి.. రంగంలోకి ఆ హీరో కూడా..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం “SSMB29”. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పాన్ ఇండియా హీరోయిన్ దిశా పటానీ నటిస్తోంది. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కూడా నటించనున్నారని తెలుస్తోంది.

తాజాగా, ఈ సినిమాలో సీనియర్ హీరో నాగార్జున కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జునతో రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. గతంలో నాగర్జున ‘రాజన్న’ సినిమాకు రాజమౌళి కొంత వర్క్ కూడా చేశారు. ఎందుకంటే ఆ సినిమాకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. మరోవైపు రాజమౌళి, మహేష్ బాబు సినిమా నిర్మాత కె.ఎల్. నారాయణతోను నాగార్జునకు మంచి బాండింగ్ ఉంది. గతంలో నాగార్జునతో కేఎల్ నారాయణ కొన్ని సినిమాలను కూడా నిర్మించారు.

నాగార్జునకి బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. గతంలో నాగ్ హిందీలోనూ కొన్ని సినిమాలు చేశారు. రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ‘బ్రహ్మాస్త్ర’ సిరీస్ లోనూ కీ రోల్ ప్లే చేశారు. నేషనల్ వైడ్ గా గుర్తుపట్టే తెలుగు హీరోల్లో నాగార్జున కూడా ఒకరు కాబట్టి ‘SSMB29’ లో ఓ కీలకపాత్ర కోసం నాగార్జునను రాజమౌళి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

రాజమౌళి సినిమాలో కీలక పాత్రలు ఎలాగూ ఉంటాయి. కాబట్టి ‘SSMB29’ మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడని వార్త ఫిలిం సర్కిల్స్ లోనూ ప్రచారం అవుతుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.