ఉత్తరాది సినీ.. బుల్లి తెర ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా అలరిస్తూ వస్తున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు తెలుగు లో సీతారామం సినిమా తో ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ అనే విషయం తెల్సిందే.
సీతారామం సక్సెస్ అయిన వెంటనే ఈ అమ్మడికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. కానీ వచ్చిన అన్ని ఆఫర్లకు ఓకే చెప్పకుండా కథ ఇంకా ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని నాని సినిమాకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. తాజాగా విజయ్ దేవరకొండ కి జోడీగా కూడా నటించేందుకు ఓకే చెప్పింది.
టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిన ఈ అమ్మడికి సైమా అవార్డ్స్ 2023 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ఆహ్వానం అందింది.
యూఏఈ లో జరుగబోతున్న ఈ కార్యక్రమంలో ఈ అందాల ముద్దుగుమ్మ పాల్గొనబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రతిష్టాత్మక సైమా అవార్డు కార్యక్రమం కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరు అవ్వడం అరుదైన అవకాశం.
బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ సౌత్ లో కూడా వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న మృణాల్ ఠాకూర్ అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సందడి చేస్తున్న నేపథ్యంలో ఈ అరుదైన గౌరవం దక్కినట్టుగా తెలుస్తోంది.