మెగాస్టార్‌ ‘గే’ సినిమా మరింత చేరువకి..!

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి మరియు జ్యోతిక జంటగా నటించిన ఎమోషనల్‌ డ్రామా ‘కాదల్ – ది కోర్’ సినిమా చిన్న సినిమాగా విడుదల అయ్యి కేరళలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం కేరళలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు సాలిడ్‌ వసూళ్లు నమోదు అయ్యాయి.

మలయాళ బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లు నమోదు చేయడం జరిగింది. మమ్ముట్టి వంటి స్టార్‌ హీరోను ఒక గే అన్నట్లుగా కథ లో చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు, ఆసక్తి ని పెంచడంలో సఫలం అయ్యింది.

ఆరు వారాల క్రితం థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులకు ఎదురు చూస్తున్నారు. ఓవర్సీస్ ప్రేక్షకులకు అద్దె రూపంలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వారు ఈ సినిమాను అందుబాటులో ఉంచడం జరిగింది. ఇండియాలో కూడా మొదట పే అండ్ వ్యూ పద్ధతిలో వారం లేదా రెండు వారాలు స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అందరికీ అందుబాటులోకి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కాదల్ ది కోర్‌ సినిమా అమెజాన్‌ ద్వారా స్ట్రీమింగ్‌ కి రెడీ అవుతోంది.

ఈ సినిమాలో మమ్ముట్టి ఒక గే అయిన భర్త పాత్రలో నటించాడు. జ్యోతిక అతని భార్య పాత్రలో నటించింది. మధ్య వయస్కులు అయిన ఈ జంట విడాకులు కోసం ప్రయత్నిస్తుంటే, ఆ సమయంలో భర్త గే అని భార్య ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలు నిజమో కాదో అనేది తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే.

మమ్ముట్టి మరియు జ్యోతిక ల కాంబో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలోని కథాంశం కూడా ఆసక్తికరంగా ఉంది. అందుకే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.