మెగాస్టార్ సేవ‌ల‌కు మోదీ ప్ర‌భుత్వం మెగా గిఫ్ట్?

ఆరు దశాబ్దాలకు పైగా సినీరంగంలో కెరీర్‌ను కొనసాగిస్తూ, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించే అవకాశం ఉంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డు ప్రకటించనున్నారు.

సినీ పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించడంతో పాటు, కోవిడ్-19 మహమ్మారి సమయంలో సామాజిక సేవకు, సేవాగుణంలో గొప్ప నిబద్ధతకు కూడా ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారని తెలుస్తోంది.

కరోనా మహమ్మారి సమయంలో చిరంజీవి యాభై కోట్ల పైగా ఖర్చు చేసి ప్రజల కోసం ఆక్సిజన్ సిలిండర్లు, అధునాతన ఎక్విప్ మెంట్ ని విదేశాల నుంచి రప్పించారు. పరిశ్రమ కార్మికుల కోసం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లక్షలాది మందికి విరాళాలు అందించారు.

చిరంజీవికి గతంలో 2006లో పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇప్పుడు పద్మ విభూషణ్ దక్కితే అది ఆయన కీర్తి కిరీటంలో మరో మైలురాయిగా నిలుస్తుంది. చిరంజీవి కెరీర్ 156వ సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్ ని ఇటీవలే లాంచ్ చేశారు.

చిరంజీవి ఈ అవార్డును అందుకున్నట్లయితే, తెలుగు సినిమా పరిశ్రమకు గొప్ప గౌరవంగా నిలుస్తుంది.