మంచు హీరో మనోజ్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇటీవల చాలా ఘనంగా జరిగింది. మనోజ్ సోదరి మంచు లక్ష్మి స్వయంగా వారి పెళ్లిని జరిపించారు. అయితే ఈ పెళ్లి మంచు మోహన్ బాబు మంచు విష్ణుకి ఇష్టం లేదని వారికి ఇష్టం లేకుండానే ఈ పెళ్లి జరిగిందని కామెంట్స్ వినిపించాయి.
అయితే తాజాగా ఈ వార్తలపై మంచు లక్ష్మి స్పందించారు. నిజంగానే మోహన్ బాబుకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగిందని ఆమె చెప్పారు. తానే స్వయంగా వారి పెళ్లి జరిపించానన్నారు. మనోజ్ మౌనిక నిజంగా చాలా ఎక్కువగా ప్రేమించుకున్నారని వాళ్ల పెళ్లికి ఇంట్లో ఒప్పించడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు.
వాళ్ల నాన్న అయితే అస్సలు ఒప్పుకోలేదని చెప్పారు. తమవి రెండు పెద్ద ఫ్యామిలీస్ కావడం ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో వారు కలిసి ఉంటారా లేదా అనే చాలా సందేహాలు ఉండంటో మోహన్ బాబు అంగీకరించలేదని చెప్పారు.
దీంతో తాను యాదాద్రి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కుకున్నానని ఆ తర్వాతే పెళ్లికి అంగీకారం వచ్చిందని ఆమె చెప్పారు. అందుకు తాను పెళ్లి తర్వాత దంపతులు ఇద్దరినీ మళ్లీ యాదాద్రి తీసుకువెళ్లానని చెప్పారు.
ఇక పెళ్లికి ముందు మనోజ్ మౌనిక ఇద్దరూ తన ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. పెళ్లి తర్వాత మౌనిక తనకు ఫోన్ చేసి అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి అని ఫోన్ చేస్తూ ఉంటుందని అయితే నేను మాత్రం చెప్పకుండా టార్చర్ చేస్తున్నాను అని మంచు లక్ష్మి చెప్పారు.
అయితే పెళ్లి తర్వాత మనోజ్ మౌనిక చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల మంచు లక్ష్మి తెలుగు లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ విమర్శలు చేశారు. తెలుగు ప్రేక్షకుల కారణంగానే తమకు అవకాశాలు రావడం లేదు అని ఆమె విమర్శించారు.