యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘వార్ -2’ షూట్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగు తోన్న సంగతి తెలిసిందే. ఓవైపు ‘దేవర’ షూట్ తో బిజీగా ఉన్న తారక్ ఇప్పట్లో ‘వార్-2’కి హాజరవ్వడం సాధ్యమయ్యేనా? అన్న సందేహాలు సైతం తెరపైకి వచ్చాయి. తాజాగా వాటన్నింటిపై క్లారిటీ వస్తోంది. ఏప్రిల్ తర్వాత తారక్ ‘వార్ -2’ సెట్స్ కి హాజరవుతాడని సమాచారం. ఏప్రిల్ అంతా ‘దేవర’ షూట్ లోనే బిజీగా ఉంటారని..వార్ -2 సెట్స్ కి వెళ్లిన తర్వాత నెల రోజులపాటు తారక్ పైనే సన్నివేశాలు చిత్రీకరణ ప్లాన్ చేసారుట.
తారక్ పై ముఖ్యమైన సన్నివేశాలన్నింటిని మే లోనే షూట్ చేసేలా ‘వార్-2’ బృందం రెడీ అవుతున్నట్లు సమాచారం. ముంబైతో పాటు థాయ్ లాండ్ లోనూ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. నెల రోజుల షెడ్యూల్ అనంతరం మళ్లీ తారక్ ‘దేవర’ షూట్ లో పాల్గొంటాడుట. అంటే జూన్ నుంచి మళ్లీ యధావిధిగా ‘దేవర’ సెట్స్ కి హాజరవుతారు. ఇప్పటికే దేవర అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు లోపు మొత్తం చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్తారని తెలుస్తోంది.
ఆగస్టు నుంచి మళ్లీ వార్ -2 సెట్స్ కి హాజరవుతాడు. అలాగే దేవర-2 షూటింగ్ కోసం కొరటాల శివ పెద్దగా గ్యాప్ తీసుకోడు. రిలీజ్ అనంతరం రెండు..మూడు నెలల్లోనే సెట్స్ కివెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కంట్యూటీ కథ కాబట్టి గ్యాప అనివార్యమని కొరటాల భావించడం లేదని సమాచారం. అప్పటికి వార్ – 2 తారక్ పై షూటింగ్ కూడా పూర్తవుతుంది. అక్కడ నుంచి యధావిధిగామళ్లీ దేవర-2 షూటింగ్ లో పాల్గొంటాడు.
ఇక ఇంతవరకూ ‘వార్ -2’ లో తారక్ పాత్రపై స్పష్టత రాలేదు. తారక్ విలన్ గా నటిస్తున్నాడని కొంత మంది మంది నోట..విలన్ కాకుండా నెగిటివ్ రోల్ అని మరికొంత మంది నోటా వినిపిస్తుంది. కానీ దీనిపై చిత్ర వర్గాలు గానీ..తారక్ గానీ ఎలాంటి లీక్ ఇవ్వడం లేదు. దీంతో తారక్ పాత్రపై సస్పెన్స్ అలాగే కొన సాగుతుంది.