కేజీఎఫ్ సిరీస్ తో తన ఇండియా స్టార్ గా మారిపోయిన కన్నడ స్టార్ హీరో యష్ ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా అని ప్రకటించలేదు. కన్నడ ఇండస్ట్రీలో రాకింగ్ స్టార్ గా గుర్తింపు పొందిన కేజీఎఫ్ స్థాయిలో తన బ్రాండ్ ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసే కథ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది దర్శకుల కథలు విన్నా కూడా వాటిపై ఆసక్తి మాత్రం చూపించలేదనే మాట కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మరల మాఫియా బ్యాక్ డ్రాప్ యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ కోసమే రాకింగ్ స్టార్ యష్ ఎదురుచూస్తూ ఉన్నారు. రీసెంట్ గా కేజీఎఫ్ చాప్టర్ 3 సినిమాని హోంబలే ఫిలిమ్స్ నిర్మాత విజయ్ కిరంగదూర్ అధికారికంగా కన్ఫామ్ చేశారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరో మూడేళ్ల సమయం అయిన పట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా యష్ 19వ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. మలయాళీ యాక్టర్ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తో యష్ మూవీ చేయబోతున్నారంట. హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ తరువాత రైటర్ గా మారి ఇప్పుడు దర్శకురాలిగా సత్తా చూపించే ప్రయత్నం ఆమె చేస్తున్నారు.
ఇప్పటికే మూడు సినిమాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కాయి. రీసెంట్ గా ఆమె ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ కథని యష్ కి నేరేట్ చేసారంట. ఈ కథ అతనికి బాగా నచ్చడంతో చేయడానికి ఒకే చెప్పారంట. ప్రస్తుతం ఈసినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందంట. అది కంప్లీట్ అయ్యాక అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
త్వరలో దీనికి సంబందించిన కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. లేడీ దర్శకురాలితో యష్ మూవీ చేయబోతున్నాడు అంటే అది కచ్చితంగా ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. మరి దీనిలో వాస్తవంఎంత తెలియాలంటే అధికారికంగా కన్ఫర్మ్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే