యాంకర్ సుమ రాజీవ్ మధ్యలో ఈ గ్యాప్ ఉందన్నమాట!

సుమ కనకాల.. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. టాప్ యాంకర్ గా కొనసాగుతున్న ఈమె.. రాజీవ్ కనకాల భార్య అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. వీరిద్దరి ప్రేమాయణం పెళ్లి జీవితం.. ఇలా వీరి జీవితంలో జరిగే అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. స్టార్ హీరోహీరోయిన్లపై చూపించనంత ప్రేమే ఈమెపై కూడా చూపిస్తుంటారు. అయితే ఈరోజు సుమ రాజీవ్ కనకాల పెళ్లి రోజు.

దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ కలిసి నటించిన రాజీవ్ సుమలు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో 1999 ఫిబ్రవరి 10వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడూ ఒకే దగ్గర కలిసి పెళ్లి జరుపుకునే ఈ జంట.. ఈ ఏడు మాత్రం ఆన్ లైన్ ద్వారా 24వ యానివర్శరీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని సుమ కనకాల తి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. నువ్వక్కడ నేనిక్కకడ పాటక్కడ పలుకిక్కడ అంటూ సుమ ఓ రూంలో ఉండి వీడియో తీయగా.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా అంటూ రాజీవ్ కారులో ప్రయాణిస్తూ పాడాడు.

దీన్ని బట్టి వీరిద్దరూ ఈసారి పెళ్లి రోజును వేర్వేరు చోట్ల ఉండి జరుపుకున్నట్లు అర్థం అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ హ్యాపీ యానివర్సరీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉండి సెలబ్రేట్ చేస్కుంటే బాగుండేదని మరికొంత మంది చెబుతున్నారు. సుమ ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో లైకులు వందల్లో కామెంట్లు వచ్చాయి. 2.3 మిలియన్ల ఫాలోవర్లు కల్గిన సుమ… ఇప్పటి వరకు 818 పోస్టులు పెట్టింది.

ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం వీరిద్దరూ విడిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన ఈ జంట.. ఎంత పెద్ద సెలబ్రిటీ కుటుంబంలో అయినా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తాయని.. కొంత కాలానికి అవి సమసిపోతాయని వెల్లడించారు. తమ మధ్య చిన్న గొడవలు జరిగిన మాటే వాస్తవమే అయినా మరీ అంత పెద్ద గొడవలు ఎప్పుడూ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారని చెప్పడానికి ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఈ వీడియోనే నిదర్శనం.