హీరోయిన్లు మాల్దీవుల ఆస్వాదనకు వెళ్లినా..ఫోటో షూట్స్ కోసం వెళ్లినా రచ్చ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఉన్నన్ని రోజులు కుర్రాళ్లకి నెట్టింట పండగే. ఒక్కో బికినీ ఫోటో వదులుతుంటే వాటి కింద హాట్ కామెంట్లు.. భంగిమల గురించి పోస్టులు ఆహా ఓహా అనిపిస్తాయి. బికినీ..టూపీస్..స్విమ్ షూట్ అందాల ప్రదర్శనతలో సలపరం పుటిస్తారు.
భామా మణులు ఐస్ ల్యాండ్స్ లో వాలిపోతే ఇవన్నీ తప్పనిసరి. రిసార్స్ట్ నుంచి బీచ్ వరకూ ఒక్కో స్నాప్కి ఒక్కో ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడతారు. మాల్దీవలకు వెళ్లిందే బికినీ ధరించేందుకు అన్న చందంగా ఆ స్పాట్ ఫేమస్ అయింది. జాన్వీ కపూర్ నుండి అనన్య పాండే వరకు.. పూజా హెగ్డే నుండి కియారా అద్వానీ వరకు.. మౌని రాయ్ నుండి ఇలియానా వరకు.. హన్సిక నుండి వేదిక వరకు అంతా బికినీ దెబ్బకు కుర్రాళ్లకి నిదుర లేకుండా చేసారు.
అడుగు పెట్టిన దగ్గర నుంచి రిటన్ ప్లైట్ దిగే వరకూ అల్లల్లాడించేస్తారు. కానీ నేషనల్ క్రష్మిక రష్మిక మాల్దీవుల ట్రిప్ మాత్రం చాలా చప్పగానే సాగిందని తాజాగా విమర్శలొస్తున్నాయి. ఇటీవలే ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ వచ్చేసిన అమ్మడి మాల్దీవుల ట్రిప్ గురించి నెట్టంట ప్రచారం ఠారెత్తిపోతుంది. రష్మిక మాల్దీవుల ట్రిప్ కి సంబంధించి ఒకే ఒక్క ఫోటో మాత్రమే నెట్టింట వైరల్ అయింది.
ఆమెతో పాటు విజయ్ దేవరకొండ ఉన్నాడు అన్న హాట్ న్యూస్ తప్ప అంతకు మించి కుర్రాళ్లకి తగ్గ ట్రీట్ దక్కలేదనే అనిపిస్తోంది అంటున్నారు. సాధారణంగా మాల్దీవులకి వెళ్లినప్పటి నుంచి ముగింపు వరకూ ఫోటోలు పుంకాల కొద్ది ఇన్ స్టాలో అప్ లోడ్ అవుతుంటాయి. కానీ రష్మిక ఒక ఫోటోతోనే సరిపెట్టి పండగ చేస్కోండి అనేసింది.
అందులోనూ బికినీలేదు..టూపీస్ లేదు..స్వీమ్ షూట్ లేదు. ఇలా ఏది లేకుండా కేవలం టోన్డ్ బాడీ లుక్ తోనే పండగా అంటే ఎలా ? అనేస్తున్నారు. నెక్స్ట్ టైమ్ ట్రిప్ మాత్రం ఇంత చప్పగా ఉండొద్దు అంటూ సలహాలిస్తున్నారు.
అయితే రష్మిక -విజయ్ ట్రిప్ వెనుక వేరే కథ ఉందని అంటున్నారు. ఇద్దరు జంటగా ఓ మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం హాజరయ్యారు తప్ప అంతకు మించి ఇద్దరి మధ్య ఏం లేదని.. ఎలాంటి వ్యక్తిగత ట్రిప్ కాదని..అలాంటి వెకేషన్ అయితే బికినీ ట్రీట్ కచ్చితంగా ఉండేదని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం? ఎవరు నిజం? ఎంత నిజం? అన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక.