గేమ్ చేంజర్ తర్వాత రాం చరణ్ చేస్తున్న సినిమా బుచ్చి బాబు దర్శకత్వంలో వస్తుందని తెలిసిందే. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ అంతా కూడా భారీ అంచనాలతో ఉన్నారు. గేమ్ చేంజర్ ఎలాగు శంకర్ మార్క్ మూవీగా పాన్ ఇండియా ఆడియన్స్ ని అలరిస్తుందని ఫిక్స్ అవ్వగా బుచ్చి బాబు సినిమా డిఫరెంట్ అటెంప్ట్ తో మరోసారి చరణ్ గురించి పాన్ ఇండియా మొత్తం మాట్లాడుకునేలా చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు.
త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా కాస్టింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ గా చరణ్ తో జత కట్టేలా బాలీవుడ్ బ్యూటీని తీసుకొస్తున్నారని తెలుస్తుంది. ఇండియాస్ లీడింగ్ లేడీగా దీపికా పదుకొనే తన సత్తా చాటుతూ వస్తుంది. బీ టౌన్ లో సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న దీపికా ఇప్పుడు సౌత్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ కల్కి తో తెలుగు ఎంట్రీ ఇస్తున్న దీపికా మరో సినిమా చేయాలని అనుకుంటుందట.
బుచ్చి బాబు చరణ్ కాంబో సినిమాకు హీరోయిన్ గా దీపికా అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. అందుకే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది. దీపికా ఈ ప్రాజెక్ట్ లో వస్తే కచ్చితంగా సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. చరణ్ దీపికా ఈ ఇద్దరి కాంబో ఇదివరకే సినిమా రావాల్సి ఉంది. చరణ్ నటించిన తుఫాన్ సినిమా హిందీలో జంజీర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రియాంక కన్నా ముందు దీపికానే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ దీపికా అప్పుడు ఆసక్తి చూపించలేదు.
సో మళ్లీ ఇప్పుడు చరణ్ తో దీపిక జత కట్టే ఛాన్స్ వచ్చింది. కల్కితో ఎలాగు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో దీపికా అలరించనుంది. ఇప్పుడు చరణ్ సినిమాతో మరోసారి అమ్మడు తన టాలెంట్ చూపించనుంది. చరణ్ తో దీపిక రొమాన్స్ అనగానే మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న చరణ్ 16వ సినిమా కథ బాగా వచ్చిందని సినిమా తప్పకుండా మెగా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.