జేమ్స్ బాండ్ సిరీస్ నుండి వస్తోన్న తాజా చిత్రం నో టైమ్ టు డై. ఈ సినిమాను మొదట నవంబర్ 20న విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. థియేటర్లు తెరుచుకున్నా కానీ వాటికి సరైన ఆదరణ దక్కకపోవడంతో జేమ్స్ బాండ్ సిరీస్ నిర్మాతలు చిత్రాన్ని పోస్ట్ ఫోన్ చేసారు. అయితే తాజాగా నో టైమ్ టు డై సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 8, 2021 నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
క్రైగ్ ఈ సినిమాలో జేమ్స్ బాండ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇదే అతనికి చివరి బాండ్ సిరీస్ కావడం విశేషం. అయితే అక్టోబర్ 8 అనేది ఎస్ ఎస్ రాజమౌళి టార్గెట్ చేస్తోన్న డేట్. తన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ను ఆ డేట్ కు విడుదల చేయాలని అనుకుంటున్నాడు. అయితే బాండ్ సిరీస్ తో పోటీ పడడం అంటే మార్కెట్ పరంగా ఆమోదయోగ్యం కాదు. మరి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను సంక్రాంతి 2022కు వాయిదా వేస్తారేమో చూడాలి.