మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం సుదీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 7 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక టైటిల్ లో డిఫరెన్స్ చూపించిన ఈ మూవీ ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసింది. రావణాసుర అనే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ తో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో రవితేజ కనిపిస్తున్నాడు అనే చెప్పకనే చెప్పారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ట్రైలర్ గా అన్ కాన్సిస్ స్టేజ్ లో ఉన్న రవితేజని తీసుకొని వెళ్ళే విజువల్ ని చూపించారు. తరువాత యాక్షన్ మోడ్ స్టార్ట్ చేసి మరల ఒక్కసారిగా వేరియేషన్ చూపించారు.
లాయర్ పాత్రలో రవితేజని రిప్రజెంట్ చేశారు. ఇక ఆ క్యారెక్టర్ తో రొమాంటిక్ యాంగిల్ ని ఆవిష్కరించారు. అందులో అనూ ఇమ్మాన్యుయేల్ ఫైరా అబ్దులా మేఘా ఆకాష్ క్యారెక్టర్స్ చుట్టూ కొన్ని ఎలిమెంట్స్ నడిపించాడు.
అందులో లా అన్నాక ఒక్కో కేసులో ఒక్కో మలుపు ఉంటుంది అనే డైలాగ్ నుంచి యాక్షన్ షేడ్స్ లోకి కంటెంట్ తీసుకెళ్ళారు. అందులో సంపత్ రాజ్ చేయని హత్య నేరంలో ఇరుక్కోగా అతని కేస్ ని రవితేజ టేకప్ చేస్తున్నట్లు చూపించారు. వాడు క్రిమినల్ లాయర్ కాదు… లా చదివిన క్రిమినల్ అంటూ జయరామ్ క్యారెక్టర్ తో రవితేజ ఒరిజినాలిటీని ఎస్టాబ్లిష్ చేశారు.
తరువాత యాక్షన్ సీన్స్ ని నడిపించి లాస్ట్ లో మర్డర్ చేయడం క్రైమ్… కాని దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్. ఐయామ్ యాన్ ఆర్టిస్ట్ అనే డైలాగ్ ని రవితేజతో చెప్పించి ట్రైలర్ ఎండ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లో మెజారిటీ యాక్షన్ ఎలిమెంట్స్ ని ఆవిష్కరించడం ద్వారా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. అలాగే మధ్యలో హీరోయిన్స్ తో లాయర్ పాత్రలో రవితేజ రొమాంటిక్ కామెడీ కూడా ఉంటుంది అని ఎస్టాబ్లిష్ చేశారు.
ఓవరాల్ గా పోలీసులకి సవాల్ విసిరే ఓ క్రిమినల్ గా రవితేజ పాత్ర ఈ మూవీలో ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రావు రమేష్ సుశాంత్ విలన్స్ గా కనిపిస్తున్నారు. అలాగే జయరామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శనం ఇస్తున్నారు. ఓవరాల్ గా రవితేజ నుంచి ఫ్యాన్స్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు రావణాసుర మూవీలో ఉండనున్నాయని ట్రైలర్ బట్టి తెలుస్తుంది.