లాంగ్ కర్లీ బ్రౌన్ హెయిర్.. గుబురు గడ్డం కోర మీసం.. బ్లాక్ అండ్ వైట్ పూల చొక్కాయ్.. ఏంటీ రెక్లెస్ రెబలియన్ లుక్ పుష్పరాజ్ అన్నా. ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఫోటో ప్లీజ్!! ఇదీ ముంబై ఎయిర్ పోర్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడుగుపెట్టగానే కనిపించిన సన్నివేశం.
పుష్పరాజ్ ని వెంటాడి వేటాడారు ముంబై స్టిల్ ఫోటోగ్రాఫర్స్. ఒకే ఒక్క పాన్ ఇండియా హిట్టుతో అల్లు రేంజ్ అమాంతం మారిపోయింది. సౌత్ టు నార్త్ అన్నిచోట్లా అసాధారణ క్రేజ్. ముఖ్యంగా నార్త్ ఇండియా గల్లీ గల్లీ షేకైపోయింది. ఇప్పుడు అతడు ముంబైలో అడుగు పెట్టినా అంథేరి.. ఆగ్రా.. మీరట్ నగరం ఏదైనా అతడు అడుగుపెడితే చాలు జనం గుమిగూడుతున్నారు. అడుగడుగునా సెల్ఫీల కోసం ఫోటోల కోసం వెంటపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ రేంజ్ క్రేజ్ సంపాదించిన మరొక స్టార్ లేనే లేరంటే అతిశయోక్తి కాదు.
ఆ విషయం ఈ వీడియోని చూడగానే ఎవరైనా అంగీకరిస్తారు. స్టైలిష్ స్టార్ టర్న్ డ్ ఐకాన్ స్టార్ యూనిక్ లుక్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. అతడు తొడిగితే లూజ్ చొక్కా అయినా ఫ్యాషన్ గా మారాల్సిందే. అలా ఉంది ఆ లుక్. ముంబై స్టిల్ ఫోటోగ్రాఫర్లు వెంటపడి మరీ అతడిపై ఫ్లాష్ లు మెరిపించారు. పుష్ప2లో అతడి రూపం ఆహార్యం ప్రతిదీ మరో లెవల్లో ఉంటుందని ఈ చిన్నపాటి లుక్ చెబుతోంది.
ఇంతకీ పుష్పరాజ్ ముంబైలో అడుగుపెట్టిన కారణమేమిటో అర్థం కావడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ ఒకటో ఇల్లు అనుకుంటే ముంబై రెండో ఇల్లు అనుకోవాలా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అన్నది అల్లూనే చెప్పాల్సి ఉంది. పుష్పరాజ్ కా ఆగయా.. నెక్ట్స్ ఏం జరుగబోతోంది?
పుష్ప 2తో నార్త్ బెల్ట్ కి షివరింగ్ ఎలా ఉంటుందో చూపించాలని కసిగా పని చేస్తున్నారు సుకుమార్. 2023-24 సీజన్ కి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా పుష్ప 2 ఇప్పటికే చర్చల్లో ఉంది. ఈ సినిమాని ప్రపంచ దేశాల్లో పలు భాషల్లోను విడుదల చేయడం ఖాయమన్న టాక్ ఉంది.