లోకేష్ లోకంలో తలైవా దిగితే?

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా యూనివర్స్ లోకి ఇప్పటికే కమల్ హాసన్ సూర్య కార్తి ఫాహాద్ ఫజిల్ విజయ్ సేతుపతి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ ని కూడా ఈ యునివర్స్ లోకి తెస్తూ లియో చేస్తున్నాడనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం విజయ్ లోకేశ్ లియో సినిమా షెడ్యూల్ బ్రేక్ లో ఉందని.. వచ్చే నెలలో చెన్నైలో లియో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుందని సమాచారం.

ఇదిలా ఉంటే… లోకేశ్ తన నెక్ట్ ప్రాజెక్ట్ పై ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అది కూడా తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో సినిమా చేయబోతున్నట్లు టాక్. తలైవా 171వ సినిమాకు లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.

లోకేశ్ కనగరాజ్ రజినీకాంత్ను త్వరలోనే కలువబోతున్నాడని.. తలైవా 171 సినిమాను లోకేశ్ గత చిత్రాలను తెరకెక్కించిన నిర్మాతల్లో ఒకరు నిర్మించబోతున్నారని జోరుగా చర్చ నడుస్తోంది.

అయితే ఈ సినిమా నెక్ట్ లెవెల్ ఉంటుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీతో సినిమాను లోకి తన యూనివర్స్ తో కలుపుతాడనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక అలా కలిపితే.. భారీ మల్టీ స్టారర్ కానుంది. ఇప్పటికే కమల్ హాసన్ సూర్య కార్తి ఫాహాద్ ఫజిల్ విజయ్ సేతుపతి… దళపతి విజయ్.. వీరికి తోడు రజినీ కాంత్ అంటే … ఇక ఈ సినిమా ఊహకందని రేంజ్లో ఉంటుందనడంలో సందేహం లేదు.

ఈ చిత్రాన్ని కమల్ హాసన్ హోం బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం ఏ జోనర్లో రాబోతుందనేది తెలియాల్సి ఉంది. ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే… తలైవా ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న జైలర్ సినిమాలో నటిస్తున్నాడు.

ఇది తలైవాకు 169వ ప్రాజెక్ట్. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. కాగా రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 కూడా ప్రకటించేశాడు. ఇక మరో సినిమా తలైవా 171 సినిమా లోకేష్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.