వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా డిజిటల్ చిత్రాలను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే పలు చిత్రాలను డిజిటల్ ఫార్మాట్లో విడుదల చేసిన వర్మ ప్రస్తుతం మర్డర్, థ్రిల్లర్‌తో పాటు న్యూస్ ప్రాస్టిట్యూట్ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. మర్డర్ మరియు థ్రిల్లర్ చిత్రాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఆ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలపై వర్మ ప్రకటించే అవకాశం ఉంది. మరో వైపు కొత్త ప్రాజెక్ట్‌లను వర్మ చేస్తూనే ఉన్నాడు. మరో అడల్ట్ కంటెంట్ మూవీని వర్మ తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈసారి లెస్బియన్ కాన్సెప్ట్‌ను ఎంపిక చేశాడు.
ఇండియాలో మొట్టమొదటి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ వర్మ ఈ పోస్టర్‌ను విడుదల చేశాడు. రామ్ గోపాల్ వర్మ ఈసారి మరింతగా ఈ సినిమాతో ప్రేక్షకులను రెచ్చగొట్టేలా ఉన్నాడు. బూతు సినిమాకు తక్కువ కంటెట్ సినిమాకు తక్కువ అన్నట్లుగా ఇది ఉంటుందని పోస్టర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిల మద్య ప్రేమ ఆ ప్రేమ కారణంగా జరిగిన పరిణామాలను ఈ సినిమాలో వర్మ చూపిస్తాడని అర్థం అవుతోంది.
థ్ల్రిర్ చిత్రంలో నటించిన అప్సర రాణి మరియు నైనా గంగూలీ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇద్దరు కూడా లెస్బియన్స్ గా ఇందులో కనిపించబోతున్నారు. షూటింగ్ మొదలయ్యింది. ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. వర్మ వరుసగా చేస్తున్న సినిమాల్లో ఇది చాలా విభిన్నంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ సినిమా మరెన్ని వివాదాలను మూట కట్టుకుంటుందో చూడాలి.