టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్-2 సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న మూవీలు కావడంతో తారక్ పాన్ ఇండియా లెవెల్ లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దేవర పార్ట్-1 దసరా కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన దేవర గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా.. కొత్త అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఓవైపు దేవర సినిమా పూర్తి చేస్తూనే.. వార్-2 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు తారక్. హృతిక్ రోషన్ తో కలిసి యాక్షన్ మోడ్ లో దుమ్ముదులిపేయనున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు యష్ రాజ్ స్టూడియోస్ లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు తారక్. మళ్లీ నిన్న ముంబై వెళ్లారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక దేవర షూటింగ్ లో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. వార్-2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. ఎన్టీఆర్, హృతిక్ తో నాటు నాటు లాంటి పాట ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే వార్-2 మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తో బీ టౌన్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. వార్-2తో భారీ హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తుండడంతో ఎన్టీఆర్ బాగా కష్టపడాలని సినీ పండితులు చెబుతున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్న తారక్.. తనలోని టాలెంట్ ను అంతా బయటపెట్టాలని సూచిస్తున్నారు.
హృతిక్ రోషన్ కు ఉన్న టాలెంట్, క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో తారక్ తక్కువేం కానప్పటికీ.. ఈ మూవీ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు సినీ పండితులు. హృతిక్ తో సమానంగా పేరు సంపాదించాలంటే.. అన్నింట్లో తగ్గేదేలే అన్నట్లు కష్టపడాలని చెబుతున్నారు. అదే సమయంలో బాలీవుడ్ రామాయణంలో నటిస్తున్న యష్ ను గుర్తు చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న రామాయణంలో కేజీఎఫ్ ఫేమ్ యష్ రావణుడిగా కనిపించనున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సాయి పల్లవి సీతగా యాక్ట్ చేస్తోంది. రావణుడి పాత్ర పవర్ ఫుల్ అయినప్పటికీ.. యష్ ఈజీగా నటించేస్తారని సినీ పండితులు చెబుతున్నారు. తారక్, యష్ ఇద్దరూ బాలీవుడ్ మల్టీ స్టారర్స్ లో నటిస్తున్నప్పటికీ.. ఎన్టీఆర్ కాస్త ఎక్కువ కష్టపడాలని అంటున్నారు. మరి తారక్.. వార్-2 సినిమాతో ఎలాంటి పేరు సంపాదించుకుంటారో చూడాలి.